మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ హీరో ఎలాంటి సపోర్ట్ లేకుండా సినిమాల్లోకి వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తనదైన నటనతో ప్రేక్షకుల మనసులను దోచుకున్నాడు. ఎంతో మంది హీరోయిన్లు దర్శక నిర్మాతలు చిరంజీవి సినిమాలతో చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి గొప్ప స్థాయికి ఎదిగిన వారు ఉన్నారు. చిరంజీవి చాలామందికి తనవంతు సహాయం చేస్తూనే ఉంటారు. తన కెరీర్లో ఇప్పటివరకు ఎన్నో మంచి సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక చిరంజీవి తన నటనతో మాత్రమే కాకుండా తన మంచితనంతో కూడా గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. 

ఇక మెగాస్టార్ చిరంజీవి వయసు పెరిగినప్పటికీ ఏమాత్రం ఆలోచించకుండా అదే జోరును కొనసాగిస్తూ ఇప్పటికీ సినిమాలలో నటిస్తున్నారు. చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనంతరం చిరంజీవి - అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమాను చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. అనిల్ రావిపూడి సినిమా కథను సిద్ధం చేసి చిరంజీవి కోసం వెయిట్ చేస్తున్నారట. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా చాలామంది పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే వాటిపై ఇంతవరకు ఎలాంటి క్లారిటీ రావడం లేదు.

 మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుందని అనేక రకాల వార్తలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. నయనతార ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా సినీ వర్గాల్లో టాక్ వినిపించింది. అయితే ఏమైందో తెలియదు నయనతార మెగాస్టార్ చిరంజీవి సినిమాను రిజెక్ట్ చేసినట్లుగా కొన్ని రకాల వార్తలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి. నయనతార మెగాస్టార్ చిరంజీవితో నటించడానికి ఒప్పుకోవడం లేదట. ఈ విషయం గురించి అనిల్ రావిపూడి ఏదో క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం బయటికి రాదు. ఇక ఈ సినిమా షూటింగ్ ను త్వరలోనే ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారట. సినిమాను కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలని ప్లాన్ లో ఉన్నారట మేకర్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: