టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో నటి సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ చిన్నది ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమై మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. సమంతసినిమా అనంతరం వరుసగా సినిమాలు చేసుకుంటూ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగించింది. ఇప్పటివరకు సమంత నటించిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి.


సామ్ ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరి సినిమాల్లో హీరోయిన్ గా నటించి తనకంటూ ప్రత్యేకమైన పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఇక సమంత ప్రస్తుతం బాలీవుడ్ లోనూ సినిమాలలో నటిస్తూ అక్కడ అభిమానులను ఆకట్టుకుంటుంది. సమంత నటనకు గాను టాలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతగా అభిమానులు ఉన్నారు. సమంత ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండడమే కాకుండా సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.


తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటుంది. సోషల్ మీడియాలో సమంతకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఇక సమంతకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి. అందులో సమంత తన జుట్టు తీసేసి గుండుతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.


అయితే అవి ఏఐ ఫోటోలు అని కొంతమంది కామెంట్లు చేయగా.... మరి కొంతమంది సమంత నిజంగానే గుండు చేయించుకుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సమంత రీసెంట్ గా తిరుమల శ్రీవారి వద్దకు వెళ్ళింది. దీంతో సమంత అక్కడ గుండు చేయించుకుందని కొంతమంది అంటున్నారు. అంత పెద్ద హీరోయిన్ అయి ఉండి గుండు చేయించుకోవడం ఏంటని కొంతమంది అంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: