
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మీనాక్షి చౌదరి మాట్లాడుతూ తన చిన్నతనంలో ఇతరులతో తాను మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడేదాన్ని (కాలేజీల్లో) ఎందుకంటే ఆ రోజుల్లో తన ఎత్తు 6.2 ఉండేదని ఈ కారణం చేత తనతో చాలామంది దూరాన్ని మెయింటైన్ చేసే వారిని కూడా తెలియజేసింది. తన ఎత్తే తనకు సమస్యగా మారిందని అప్పుడప్పుడు ఇది చాలా సార్లు తనని బాధ కలిగించేలా చేసిందని తెలిపారు. తన తండ్రి కూడా ఆర్మీ ఆఫీసారని మా నాన్నకు ఆ విషయం చెబితే నీ సమస్యను నువ్వే పరిష్కరించుకోవాలి అంటూ తెలిపారట.
ఇక అప్పటినుంచి తనకు తానకు బుక్కులే స్నేహితులు గా మారారని బుక్స్ చదవడం అందాల పోటీలలో పాల్గొనడం ఆటల పైన ఆసక్తి కలగడం వంటివి జరిగాయని ఇండస్ట్రీలో వచ్చిన ప్రతి ఆఫర్ ని కూడా తాను సద్వినియోగం చేసుకున్నానని తెలిపింది. తాను సాధ్యమైనంతవరకు కష్టపడుతూ ఉంటానని అది చిన్న పాత్ర అయినా పెద్ద పాత్ర అయినా సరే వదులుకోకూడదని నిర్ణయం తీసుకున్నారని తెలిపింది మీనాక్షి చౌదరి. మొదటిసారి ఇచ్చట వాహనంలో నిలపరాదు అనే సినిమా వల్లే తనకు ఖిలాడి సినిమాలో కూడా అవకాశం లభించిందని.. అందుకే ఏ చిన్న ఆఫర్ అయినా కూడా కచ్చితంగా అది కెరియర్ కి ఉపయోగపడుతుందని తన గట్టి నమ్మకమని తెలిపింది.