ప్రతి సంవత్సరం టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఏ సినిమా అయిన ప్రేక్షకులను అలరించడానికే రూపొందిస్తారు. అయితే అందులో కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతాయి. మరికొన్ని సినిమాలు ప్రేక్షకుల అంచనాలను మించి ఆశ్చర్యపరుస్తాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో చాలామంది డైరెక్టర్ లు ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలపైనే ఫోకస్ చేస్తున్నారు. ఇలా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ.. మంచి ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటున్నారు.  ఈ క్రమంలో కొన్ని సినిమాలు రికార్డులు బ్రేక్ చేస్తూ 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాయి. అయితే వాటిలో ప్రస్తుతం 8 సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి పరిచయం అనవసరం. టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియాలో మొత్తం మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. ప్రభాస్ బాహుబలి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమను పాన్ ఇండియా లెవెల్ కి తీసుకెళ్లాడు. ఈ సినిమాలో హీరోయిన్ లుగా అనుష్క శెట్టి, మిల్క్ బ్యూటీ తమన్న నటించారు. ఈ మూవీలో రమ్యకృష్ణ, నాజర్ ముఖ్య పాత్రలు పోషించారు. బాహుబలి మూవీలో విలన్ గా దగ్గుబాటి రానా నటించాడు. ఈ సినిమా 2 పార్ట్ లతో ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించారు. ఈ మూవీ 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది.
 
దీంతోపాటుగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ హీరో రామ్ చరణ్ మెయిన్ రోల్స్ లో నటించారు.  ఈ మూవీలో బాలీవుడ్ నటి ఆలియా భట్ కూడా ముఖ్యపాత్ర పోషించింది. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్ సొంతం చేసుకుంది. కలెక్షన్లతో పాటు ప్రేక్షకుల మనసును కూడా దోచుకుంది. ఆర్ఆర్ఆర్ మూవీ కూడా 100 కోట్ల క్లబ్ లో చోటు సంపాదించుకుంది. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా కూడా 100 కోట్ల క్లబ్ లో స్థానం సొంతం చేసుకుంది. ఈ సినిమాని 2 పార్ట్స్ గా డైరెక్టర్ సుకుమార్ తెరపైకి తీసుకువచ్చారు. ఈ సినిమా తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కనడ, హిందీ భాషలో కూడా విడుదలైంది. నేషనల్ క్రష్ రష్మిక మందన, ఫహద్ ఫజిల్, అనసూయ, సునీల్ ముఖ్యపాత్రలో నటించారు. టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కల్కి సినిమా కూడా 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఈ సినిమాకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనే, దిశాపటానీ ప్రధాన పాత్రలో నటించారు. పవర్ ఫుల్ హీరో యష్ నటించిన కేజీఎఫ్ మూవీ 100 కోట్ల క్లబ్ లో స్థానం సంపాదించుకుంది. ఈ సినిమాలో నటి శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఇప్పటికే చాప్టర్, 1 చాప్టర్ 2ని పూర్తి చేసుకుని.. చాప్టర్ 3 పనుల్లో ఉంది. ఈ మూవీని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు.

బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా 100 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా మహిళల సాధికారత గురించి రూపొందించింది. ఈ మూవీ 100 కోట్ల క్లబ్ లో చేరింది. అలాగే స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన పఠన్ చిత్రం కూడా 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ సినిమాలో దీపికా పదుకొనే, జాన్ అబ్రహం ముఖ్య పాత్రలో నటించారు. షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా కూడా 100 కోట్లు వసూలు చేసి క్లబ్ లో చేరిపోయింది. ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో షారుక్ ఖాన్ ద్విపాత్రాభినయం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: