- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమాల్లో ఒక‌టి హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా. ఇపుడు ప‌వ‌న్ న‌టిస్తోన్న మూడు సినిమాల‌లో ముందుగా వ‌చ్చే సినిమా వీర‌మ‌ల్లు. ఆ త‌ర్వాత సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ న‌టించే ఓజీ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ రెండు సినిమాలు పూర్త‌య్యాక కానీ ప‌వ‌న్ హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే ఓజీ సినిమాలో న‌టించ‌డు. ఇక ద‌ర్శ‌కుడు జ్యోతికృష్ణ తెర‌కెక్కిస్తోన్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా ఎప్పుడో రావాల్సి ఉంది. ఇప్ప‌టికే ఈ సినిమా మూడు నాలుగు సార్లు వాయిదాలు కూడా ప‌డింది. అలా వాయిదాలు ప‌డుతూనే వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు వీర‌మ‌ల్లు సినిమా పై కొన్ని క్రేజీ రూమ‌ర్స్ కూడా ఉన్నాయి. ఈ సినిమా ఎన్ని సార్లు వాయిదాలు ప‌డుతున్నా కూడా అదిరిపోయే బిజినెస్ డీల్స్ జ‌రుగుతుండ‌డం ట్రేడ్ వ‌ర్గాల‌ను సైతం ఆశ్చ‌ర్య ప‌రుస్తోంది.


ఒక్క తెలుగు రాష్ట్రాల లోనే 140 కోట్ల మేర బిజినెస్ ని చేస్తున్నట్టుగా టాక్ నడుస్తుంది. మెయిన్ గా ఒక్క ఆంధ్ర ప్ర‌దేశ్ లోనే ఈ సినిమా రు. 100 కోట్ల మేర బిజినెస్ డీల్స్ జ‌రుగుతున్న‌ట్టు టాక్ ? ఇదంతా బాగానే ఉంది. కానీ ఇంత ఆల‌స్యం అవుతున్నా కూడా సినిమా ప‌ట్ల క్రేజ్ త‌గ్గ‌క పోవ‌డం ఇప్పుడు ప‌వ‌న్ ప‌వ‌ర్ .. ప‌వ‌న్ క్రేజ్ ఎలా ఉందో చెప్పేందుకు నిద‌ర్శ‌నం. అయితే అంత పెద్ద టార్గెట్ రీచ్ అవుతుందా ?  లేదా ? అన్న సందేహాలు సైతం ఉన్నాయి. ప‌వ‌న్ అభిమానులు సైతం ఈ విష‌యం లో కాస్త అప‌న మ్మ‌కంతో ఉన్నారు. మ‌రి వీటిని అన్నింటిని దాటుకొని వీరమల్లు ఎంతవరకు రాబడతాడో అనేది వేచి చూడాలి మరి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: