
ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల జాబితా చాలా పెద్దదే . దాదాపు ఐదేళ్లపాటు కాల్ షీట్స్ మొత్తం ఫిల్ అయిపోయాయి . మారుతి దర్శకత్వంలో రాజా సాబ్.. హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ .. సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో స్పిరిట్ .. మరొకపక్క సలార్ 2.. కల్కి 2 ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నెన్నో ప్రాజెక్ట్ లు వస్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమాలో నటించబోతున్నాడు అంటూ న్యూస్ బయటకు వచ్చింది .
హనుమాన్ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ స్టార్ డం అమాంతం పెరిగిపోయింది . ఇప్పుడు పాన్ ఇండియా స్టార్సే ఆయన టార్గెట్. కాగా ప్రశాంత్ వర్మ - ప్రభాస్ కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్గా ఒక ఫ్లాప్ బ్యూటీని తీసుకోవడం ఫ్యాన్స్ కి కడుపు మండిపోయేలా చేస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్గా మిస్టర్ బచ్చన్ సినిమాలో నటించిన భాగ్యశ్రీ బోర్సేను హీరోయిన్గా చూస్ చేసుకున్నారట ప్రశాంత్ వర్మ. ప్రభాస్ కూడా అందుకు ఓకే చేశారట . భాగ్యశ్రీ కు అసలు హిట్సే లేవు . మరి అలాంటి హీరోయిన్ ని ఎలా చూస్ చేసుకుంటారు ..? అది కూడా పాన్ ఇండియా రేంజ్ ఉన్న ప్రభాస్ సినిమాలో అంటూ ఫైర్ అవుతున్నారు అభిమానులు . ప్రభాస్ అయినా చెప్పాలిగా అంటూ ప్రభాస్ పై కూడా నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు . ప్రభాస్ తీసుకున్న నిర్ణయం అభిమానులు కడుపు మండిపోయేలా చేస్తుంది..!