
నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ సినిమా హిట్ 3. హిట్ ప్రాంచైజీ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతుండడం తో హిట్ 3 సినిమా లో నాని నటించడంతో ఈ సినిమా పై అంచనాలు ఒక్క సారిగా ఆకాశాన్ని అంటేశాయి. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు కొల్లగొడుతోంది. కేవలం రెండు రోజుల్లో రు 61 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. అసలు ఇది మామూలు సెన్షేషన్ విజయం కాదనే చెప్పాలి. ఓ మిడిల్ రేంజ్ హీరో నటించిన సినిమా ఈ స్థాయి లో వసూళ్లు రాబట్టడం చాలా గ్రేట్ అని చెప్పాలి. ఇలా బుకింగ్స్ పరంగా కూడా సాలిడ్ నంబర్స్ అందుకుంటున్న ఈ చిత్రం గత 24 గంటల్లో 2 లక్షల కంటే ఎక్కువ టికెట్స్ ని వరుసగా బుక్ చేసుకుంటూ బాక్సాఫీస్ ను సేక్ చేస్తోంది. ఏదేమైనా నాని ఈ సమ్మర్ లో థియేటర్ల ను హౌస్ పుల్స్ చేస్తున్నాడు. ఓవరాల్ గా అర్జున్ సర్కార్ మ్యానియా మాత్రం ఇపుడు మామూలు లెవెల్లో లేదు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా వాల్ పోస్టర్ సినిమా అలాగే యూనానిమస్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు