టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తారక్ ఆఖరుగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర పార్ట్ 1 అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం తారక్ హిందీ సినిమా అయినటువంటి వార్ 2 లో నటిస్తున్నాడు. ఈ మూవీ లో తారక్ తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నటనలో ఒకరు అయినటువంటి హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నాడు.

మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో ఈ మూవీ కి సంబంధించిన పనులన్నీటిని ఫుల్ స్పీడుగా మేకర్స్ పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా వచ్చే వారం నుండి తారక్ "వార్ 2" మూవీలోని తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ ను స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక వచ్చే వారం తారక్మూవీ కి సంబంధించిన తన పాత్ర డబ్బింగ్ ను మొదలు పెట్టి తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ మొత్తం పూర్తి అయ్యే వరకు కంటిన్యూగా చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ కి సంబంధించిన డబ్బింగ్ పనులు పూర్తి అయ్యాక ఈ మూవీ యొక్క ప్రమోషన్లను కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలి అని మేకర్స్ ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ను పెద్దగా మేకర్స్ విడుదల చేయలేదు. ఇప్పటి వరకు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్ కంటెంట్ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉన్నట్లయితే ఈ మూవీ పై అంచనాలు తారా స్థాయికి చేరే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: