సినిమా ఇండస్ట్రీ లో ఒక భాషలో అద్భుతమైన విజయం సాధించిన మూవీ ని మరో భాషలో రీమిక్ చేయడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో ఏదైనా భాషలో ఓ సినిమా విడుదల అయ్యి మంచి విజయం సాధించింది అంటే చాలు ఆ సినిమా చాలా తక్కువ కాలంలోనే ఏదో ఒక ఓ టీ టీ లోకి వస్తూ ఉండడంతో రీమిక్ ఫార్ములా రీసెంట్ టైమ్ లో పెద్దగా వర్కౌట్ కావడం లేదు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ నటుడు నాగ చైతన్య "తండెల్" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే.

మూవీ లో సాయి పల్లవి హీరోయిన్గా నటించగా ... చందు మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ శ్రీకాకుళంలో మత్స్యకారుల జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ద్వారా నాగ చైతన్య , సాయి పల్లవి లకు మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే ఇదే కథతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి క్రిష్ జాగర్లమూడి అరేబియన్ కడలి అనే టైటిల్ తో అమెజాన్ ప్రైమ్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో ఓ వెబ్ సిరీస్ ను రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది.

మరి ఇప్పటికే శ్రీకాకుళం మత్స్యకారుల జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన తండెల్ మూవీ మంచి విజయాన్ని సాధించింది. మరి క్రిష్ జాగర్లమూడి ఆల్మోస్ట్ ఇదే కథతో అరేబియన్ కడలి అనే టైటిల్తో మూవీ ని రూపొందిస్తాడా ..? లేక కథలో ఏమైనా మార్పులు , చేర్పులు చేస్తాడా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: