భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో పహల్గాం ఉగ్రదాడి ఘటనకు ధీటుగా బదులిచ్చే దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే పాకిస్తాన్ మాత్రం తప్పుడు ప్రచారాలతో తెగబడుతుండటం గమనార్హం. పాకిస్తాన్ పాలకుల వెన్నులో వణుకు పుట్టే దిశగా భారత్ అడుగులు వేస్తుండటం గమనార్హం. తొమ్మిది ప్రాంతాల్లో మన దేశ సైన్యం ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేయడం కొసమెరుపు.
 
అయితే పాక్ ప్రధాని మాత్రం తమ దేశ సైన్యం ధీటుగా స్పందిస్తుందని చెప్పుకొచ్చారు. అర్ధరాత్రి .128 గంటలకు దాడులు మొదలయ్యాయని 1.44 గంటలకు స్ట్రైక్స్ జరిగాయని తెలుస్తోంది. అయితే ఈ దాడుల్లో కొందరు పాక్ పౌరులు కూడా మృతి చెందినట్టు పాక్ ప్రధాని ఆరోపణలు చేస్తున్నారు. మసీదులపై దాడులు జరగకపోయినా జరిగినట్టు కుట్రపూరిత ఎత్తుగడలు వేస్తున్నారు.
 
అయితే మన దేశం ఈ దాడుల కోసం హామర్ స్మార్ట్ బాంబులను ఉపయోగించి నిర్దేశించిన లక్ష్యాలపై దాడులు చేసినట్టు సమాచారం అందుతోంది. పాక్ నేత షరీఫ్ ప్రకటనలు అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని వెల్లడైంది. పాక్ ఉగ్రవాదులు ప్రత్యేకంగా హిందువులను టార్గెట్ చేసి దాడులను నిర్వహించింది. అంతర్జాతీయ ముస్లిం దేశాల మద్దతు కోసం పాక్ ప్రయత్నిస్తోంది.
 
మతపరమైన సానుభూతి పొందడానికి పాక్ ప్రయత్నాలు చేస్తుండగా ఈ ప్రయత్నాలకు పాక్ ధీటుగా బదులివ్వాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. భారత్ ఫైటర్ జెట్లను కూల్చివేసినట్టు పాక్ చెబుతుండగా ఈ ప్రచారం కూడా బూటకమేనని తెలుస్తోంది.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: