నందమూరి నట సింహం బాలకృష్ణ కొంత కాలం క్రితం డాకు మహారాజ్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం మనకు తెలిసిందే. బాబి కొల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ కి మంచి టాక్ రావడంతో అద్భుతమైన కలెక్షన్లు ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా దక్కాయి. కానీ ఈ సినిమాకు భారీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగడంతో ఈ మూవీ భారీ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను వసులు చేసిన కూడా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములాకు చాలా దగ్గరగా వచ్చింది. కానీ హిట్ స్టేటస్ ను అందుకోలేదు. ఇలా ఈ సినిమాకు అద్భుతమైన టాక్ వచ్చి భారీ కలెక్షన్లను సాధించే హిట్ స్టేటస్ కి అతి దగ్గరగా వచ్చి ఆగిపోవడంతో బాలయ్య అభిమానులు కాస్త డిసప్పాయింట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే డాకు మహారాజ్ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ వచ్చాయి. మొత్తంగా ఎన్ని కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమాకు నైజాం ఏరియాలో 15.35 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 12.75  కోట్లు , ఉత్తరాంధ్రలో 11.15 కోట్లు , ఈస్ట్ లో 7.25  కోట్లు , వెస్ట్ లో 5.30 కోట్లు , గుంటూరులో 8.14 కోట్లు , కృష్ణ లో 5.48 కోట్లు , నెల్లూరు లో 3.48 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 68.90 కోట్ల షేర్ , 108.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇక ఈ మూవీ కి  కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 4.25 కోట్లు , ఓవర్సీస్ లో 8.30 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 81.45 కోట్ల షేర్ ... 136 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ 82 కోట్ల టార్గెట్ తో  బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఇకపోతే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మరో 55 లక్షల నష్టాలను ఎదుర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: