ప్రముఖ నటి శోభిత ధూళిపాల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మోడల్ గా తన కెరీర్ ప్రారంభించి విజయాన్ని సాధించింది. అనంతరం సినిమాల మీద ఉన్న ఆసక్తితో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. వెబ్ సిరీస్ లలో నటించి సక్సెస్ అందుకున్న ఈ చిన్నది తెలుగులో అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా నటించింది తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ లో అనేక సినిమాలలో నటించింది. 

ఇక శోభిత వ్యక్తిగత విషయానికి వచ్చినట్లయితే.... అక్కినేని నాగచైతన్యతో వివాహం తర్వాత ఈ భామ నిత్యం ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నారు. శోభిత వివాహం తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. కేవలం నాగచైతన్యకు సంబంధించిన సినిమా వ్యవహారాలను దగ్గర ఉండి మరీ చూసుకుంటుంది. ఈ క్రమంలోనే నాగచైతన్య హీరోగా నటించిన తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజున శోభిత హాజరయ్యారు. అక్కడికి అల్లు అరవింద్ కూడా రావడం జరిగింది. 

అల్లు అరవింద్ శోభితతో మాట్లాడుతూ తన భుజాలపై చేయి వేసి గట్టిగా నొక్కినట్టుగా వీడియోలో ఉంది. దీంతో ఈ వీడియోని చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కూతురు వయసులో ఉన్న అమ్మాయితో అలా చేయడం సరికాదంటూ కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది ఈ వీడియో పై పాజిటివ్ గా స్పందిస్తే మరి కొంతమంది అక్కినేని అభిమానులు సీరియస్ అవుతున్నారు. 

కూతురు లాంటిది అనుకోని అల్లు అరవింద్ అలా చేశాడని అంత పెద్ద మనిషిని పట్టుకొని అలా ట్రోల్ చేయడం సరికాదు అంటూ అల్లు అభిమానులు సీరియస్ అవుతున్నారు. ఈ వీడియోని చూసిన అక్కినేని అభిమానులు సైతం ఫైర్ అవుతున్నారు. ఈ వీడియో అనంతరం అల్లు వర్సెస్ అక్కినేని కుటుంబాల మధ్య కూడా గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కొంతమంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: