నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాల్లో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. అనేక సినిమాలలో నటించి విజయాలను సొంతం చేసుకున్నాడు. నాని హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగానువ్వు వ్యవహరిస్తారు. తన నిర్మాణ రంగంలో అనేక సినిమాలను నిర్మించారు. ఈ హీరో నటించిన తాజా చిత్రం హిట్ 3. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో నాని సరసన హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటించారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే చిత్ర బృందం తాజాగా సక్సెస్ మీట్ ను కూడా నిర్వహించారు. అందులో నాని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. 


సినిమా అనంతరం నాని తన తదుపరి సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు. నాని - శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో "ది ప్యారడైజ్" సినిమా తెరకెక్కనుంది. ఇందులో నాని ఇంతవరకు ఎప్పుడు నటించని విధంగా ట్రాన్స్ జెండర్ పాత్రను పోషించనున్నాడు. ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఈ పోస్టర్ లో నాని లుక్ చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. ఇప్పటివరకు ఏ హీరో కూడా ఇలా నటించడానికి సాహసం చేయలేదని చెప్పవచ్చు. నాని ఇలా నటిస్తున్నారని తెలిసి తన అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. నాని సరసన ది ప్యారడైజ్ సినిమాలో హీరోయిన్ గా ప్రముఖ నటి ఖయాదు లోహర్ నటించబోతున్నట్టుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ భామ డ్రాగన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని అందుకున్నట్టుగా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఈ చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ది ప్యారడైజ్ సినిమాలో ఖయాదు లోహర్ మాత్రమే కాకుండా మరో హీరోయిన్ కూడా నటించబోతుందట.

మరో హీరోయిన్ ను ఎంపిక చేసే పనిలో మేకర్స్ ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఆ హీరోయిన్ ఎవరు ఏంటి అనే విషయాలు తొందర్లోనే వెలబడనున్నాయి. ఇప్పటికే ది పారడైజ్ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాయి. ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా నిర్వహిస్తున్నారట. అతి తొందరలోనే సినిమా రిలీజ్ చేయాలని శ్రీకాంత్ ఓదెల భావిస్తున్నారట. దీనికి సంబంధించిన చిత్రీకరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ సినిమా కోసం నాని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: