కొన్ని కొన్ని సినిమాలలో హీరో పాత్ర కన్నా సరే ..ఆ సినిమాలో నటించే వేరే క్యారెక్టర్ హైలెట్ అవుతూ ఉంటుంది.  అలా హైలైట్ అవుతుంది అంటూ ముందుగానే ఆ పాత్రలో నటించే వాళ్లని బట్టి అర్థం అయిపోతుంది.  ప్రెసెంట్ అలాంటి ఒక పాత్రను చూస్ చేసుకున్నాడు కన్నడ సూపర్ స్టార్ హీరో ఉపేంద్ర . ఉపేంద్ర గురించి చెప్పాలి అంటే చాలా మ్యాటర్ ఉంటుంది . చాలా చాలా టాలెంటెడ్ యాక్టర్ . ఆయన నటించిన సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కన్నడలోనే కాదు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ఉపేంద్ర .

మరి ముఖ్యంగా అల్లు అర్జున్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లక్ బస్టర్ గా నిలిచిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో లీల్ క్యారెక్టర్ లో కనిపించి సినిమా హిట్ అవ్వడానికి కారణమయ్యాడు.  అల్లు అర్జున్ సినిమాలో ఉపేంద్ర నటిస్తున్నాడని తెలియగానే జనాలు ఓ రేంజ్ లో ఎక్స్ పెక్ట్ చేశారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ని ఏమాత్రం తగ్గించుకోలేదు ఉపేంద్ర. కాగా  మళ్ళీ చాలా టైం తర్వాత ఉపేంద్ర తెలుగు తెలపై కనిపించబోతున్నారు . #RAPO22 లో అదరగొట్టబోతున్నారు ఉపేంద్ర. పి మహేశ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూ ఉండడం గమనారహం.

అన్ని  వర్గాల ప్రేక్షకులను కట్టిపడేసేలా హార్ట్ టచింగ్ ఎంటర్టైన్మెంట్ తో ఈ సినిమా ఉండబోతుంది అంటూ తెలుస్తుంది . movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ..వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో ఈ మూవీ నిర్మిస్తున్నారు. . కాగా ఈ సినిమాలో సూపర్ స్టార్ ఉపేంద్ర సూర్య కుమార్ పాత్రలో కనిపించబోతున్నారు . ఈ పాత్ర ప్రతి ఒక్కరు అభిమానించే సూపర్ స్టార్ల ప్రతినిధిగా నిలుస్తుంది అంటూ మూవీ మేకర్స్ చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ కూడా చిత్ర బృందం రిలీజ్ చేసింది . అందని వాడు..అందరివాడు అంటూ ఆయన పాత్ర ని ఇంట్రడ్యూస్ చేశారు మేకర్స్. పోస్టర్ లో ఉపేంద్ర చాలా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు . ఇప్పటివరకు ఉపేంద్ర ఇలాంటి లుక్ లో కనిపించనే లేదని చెప్పాలి.  అంతేకాదు ఈ సినిమా మలుపు తిప్పే క్యారెక్టర్ లో సూర్యకుమార్ పాత్రలో ఉపేంద్ర కనిపించబోతున్నారట. ఆయన కెరియర్ లోనే స్పెషల్ రోల్ గా ఈ పాత్ర నిలవబోతుంది అంటూ కూడా మేకర్స్ చెప్పుకొస్తున్నారు. ఈ పాత్రకి సూర్య కుమార్ అనే పేరు పెట్టడం వెనుక బిగ్ ట్వీస్ట్ ఉందట. అది సినిమా రిలీజ్ అయ్యాకనే తెలుస్తుందట. రీసెంట్ గా  విడుదలైన పోస్టర్‌లో ఆయన పాపరాజీ లైట్ల మధ్య స్టైలిష్‌గా కనిపించి మెప్పించాడు.  తన స్క్రీన్ ఇమేజ్‌ తో అదరగొట్టారు. ఈ నెల 15న సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల కాబోతుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఉపేంద్ర లుక్స్ వైరల్ గా మారాయి..!


 

మరింత సమాచారం తెలుసుకోండి: