తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒకప్పుడు చాలా తక్కువ మంది యాంకర్లు ఉండేవారు. అలాంటి వారిలో ఉదయభాను ఒకరు. యాంకర్ గా ఉదయభాను తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకుంది. తెలుగు సినిమా పరిశ్రమలో యాంకర్ గా ఉదయభాను తనదైన స్టైల్, అందంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అనేక షోలలో యాంకర్ గా వ్యవహరించి పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకుంది. యాంకర్ గా మాత్రమే కాకుండా సినిమాలలోనూ కీలకపాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. యాంకర్ గా రాణిస్తున్న సమయంలోనే ఉదయభాను అతి చిన్న వయసులో వివాహం చేసుకొని తన కెరీర్ కు దెబ్బ తెచ్చుకుందని చెప్పవచ్చు. ఉదయభాను 15 ఏళ్ళు ఉన్న సమయంలో ఓ ముస్లిం వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది.

 అయితే కొన్ని మనస్పర్ధల కారణంగా అతడి నుంచి విడిపోయింది. ఆ తర్వాత ఈ భామ సినిమాలలో కీలకపాత్రలలో నటించింది. యాంకర్ గాను వ్యవహరించింది. ఆ సమయంలోనే మరోసారి ఉదయభాను విజయ్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమించింది. దీంతో ఈమె ప్రేమ వ్యవహారం అనేక రకాల చర్చలకు దారితీసింది. విజయ్ కుమార్, ఉదయభాను వద్ద పనిచేసే డ్రైవర్ అని అనేక రకాల వార్తలు వచ్చాయి. అయితే విజయ్ తో పెళ్లి విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు ఒప్పుకోలేదు. అనంతరం ఉదయభాను కుటుంబ సభ్యులతో అనేక రకాల గొడవలకు దిగింది. వారిని ఎదిరించి వివాహం చేసుకుంది. అనంతరం ఉదయభాను కెరీర్ లో అనేక రకాల ఒడిదోడుకులకు లోనైంది.

ప్రేమ, వివాహం కారణంగా బుల్లితెరపై ఆమె హవా తగ్గిపోయింది. అనంతరం మెల్లిమెల్లిగా మళ్లీ షోలలో, సినిమాలలో, సీరియల్స్ లలో అవకాశాలను అందిపుచ్చుకుంది. ఏవో కొన్నింటిలో మాత్రమే నటిస్తూ సక్సెస్ఫుల్ గా తన కెరీర్ కొనసాగించింది. ఇక ప్రస్తుతం ఉదయభానుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ భామ బిజినెస్ లు ప్రారంభించి భారీగా డబ్బులను సంపాదిస్తుంది. అంతేకాకుండా యూట్యూబ్ ఛానల్ ని కూడా నిర్వహిస్తోంది. యూట్యూబ్ ద్వారా ఎంతో కొంత ఆదాయాన్ని సంపాదించుకుంటుంది. ఇక ఉదయభాను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో షేర్ చేసుకోగా అవి క్షణాల్లోని వైరల్ గా మారుతాయి. ఈ భామకు ఒకప్పుడు విపరీతంగా అభిమానులు ఉండేవారు. ఇప్పటికీ సోషల్ మీడియాలో భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. తనకు, తన కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలను తన అభిమానులతో షేర్ చేసుకోగా అవి వైరల్ గా మారుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: