మనందరికీ తెలిసిందే .. సినిమా ఇండస్ట్రీలో హీరోగా రావాలి అంటే టాలెంట్ అందం పక్కన పెడితే ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉండాలి.  అప్పుడే ఈజీగా ఇండస్ట్రీ లోకి ఎంటర్ అవ్వచ్చు. అలాగే కొంతమంది స్టార్ రాజకీయ నాయకుల పుత్ర రత్నాలు కూడా సినిమాలోకి రావడం ఈ మధ్యకాలంలో మనం బాగా గమనిస్తున్నాం. మరీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఈ కల్చర్ ట్రెండ్ అవుతుంది . కాగా కర్ణాటకలో చాలామంది ప్రముఖుల వారసులు ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చి తమ లక్ ని పరీక్షించుకుంటున్నారు . అదే సమయంలో కర్ణాటక మాజీ మంత్రి సౌత్ లో అందరికీ బాగా తెలిసిన వ్యక్తి గాలి జనార్ధన్ రెడ్డి . ఈయన పేరు చెప్తే గజగజ వణికి పోయే వాళ్ళు ఇప్పటికి ఉన్నారు.  ఆయన కొడుకు కిరీటి రెడ్డి ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికీ తెలుసు .


కన్నడ స్టార్ట్ డైరెక్టర్ రాధాకృష్ణ డైరెక్షన్ లో కిరీటి ఎంట్రీ ఇస్తున్నాడు . ఈ సినిమాకి "జూనియర్" అంటూ ఎప్పుడో టైటిల్ ఫిక్స్ చేశారు . ఈ సినిమాలో జెనీలియా కూడా కీలకపాత్రలో కనిపిస్తూ ఉండడం అందరికీ ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది శ్రీలీల . ఈ సినిమాకి సంబంధించి ఏ అప్డేట్ రిలీజ్ అయినా సరే సినిమా ఇండస్ట్రీలో ఆరెంజ్ లో ట్రెండ్ అవుతూ ఉంటుంది . కాగా  తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫైనలైజ్ చేసారు చిత్ర బృందం.  ఈ సినిమా జూలై 18వ తేదీ శుక్రవారం రిలీజ్ చేయబోతున్నట్లు టీం ప్రకటించారు .



దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు గాలి జనార్ధన్ కొడుకు కిరీటి జూనియర్ గా నటించే సినిమాకి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి.  కాగా నిజానికి ఈ సినిమాను మే లో నే రిలీజ్ చేయాలి.  కొంచెం సినిమా షూటింగ్ పెండింగ్ ఉండడం కారణంగా జూలైకి పోస్ట్ పోన్ చేసుకున్నారు మేకర్స్.  అయితే ఏ సినిమా అయినా సరే శుక్రవారం రిలీజ్ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా హిట్ అవుతుంది అన్న నమ్మకం అందరికీ ఉంది.  మరి ముఖ్యంగా ఈ సెంటిమెంట్ ను తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు.



ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నాడు కిరీటి అంటూ కూడా నందమూరి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు ఈ సినిమాతో కిరీటి హిట్ అందుకోవడమే కాదు తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోవడానికి ఈ సినిమా ఎంతో సహాయపడుతుంది అంటూ కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు . సోషల్ మీడియాలో  గాలి జనార్ధన్ కొడుకు కిరీటి సినిమా కి సంబంధించిన వార్తలు ఇప్పుడు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: