- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

వెంకటేష్ ని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్ తో కలియుగ పాండవులు సినిమా నిర్మించారు దిగ్గజ నిర్మాత డి రామానాయుడు. ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రేమ - బ్రహ్మపుత్రుడు లాంటి సినిమాలతో ప్రభుత్వ అవార్డులు.. ప్రేక్షకుల అవార్డులు కూడా అందుకున్నారు వెంకటేష్. అయితే తన తమ్ముడికి ఒక అదిరిపోయే బ్లాక్ బ‌స్టర్ హిట్ అవ్వాలని మాస్ హీరోగా నిలబెట్టాలని సురేష్ బాబు ఆలోచించి నిర్మించిన భారీ బడ్జెట్ సినిమా బొబ్బిలి రాజా. సురేష్ సంస్థ రజితోత్సవ సంవత్సరంలో నిర్మించిన బొబ్బిలి రాజా సినిమా నిర్మాణ బాధ్యతను పూర్తిగా సురేష్ బాబుకి అప్పగించారు రామానాయుడు. హీరో పల్లెటూరు నుంచి పట్టణానికి వెళ్లి ప్రతీకారం తీర్చుకునే లైన్తో కథ సిద్ధం చేశారు పరుచూరి సోదరులు. అయితే కథ కొత్తగా లేదని.. పల్లెటూరు నుంచి అడవికి హీరోని తీసుకు వెళితే అది కొత్తగా ఉంటుందని సురేష్ బాబు సూచించారు.


అలా క‌థ మారి ఈ సినిమా తెరకెక్కింది. హీరోయిన్గా బాలీవుడ్ నుంచి దివ్యభారతిని తీసుకున్నారు. అప్పుడప్పుడే మంచి హిట్లతో ఫామ్ లోకి వస్తున్న బి.గోపాల్ ను దర్శకుడుగా పెట్టుకున్నారు. 1990 సెప్టెంబర్ 14న బొబ్బిలి రాజా సినిమా రిలీజ్ అయింది. ఫస్ట్ డే మంచి టాక్ ఉన్న రెండో రోజు నుంచి కలెక్షన్లు తగ్గాయి. అయితే ఈ సినిమా చూసిన రామానాయుడు సినిమా క్లాస్ గా ఉందని మాస్ ఎలిమెంట్స్ మరిన్ని పెట్టి ఉంటే పెద్ద హిట్టే అయ్యేద‌ని తండ్రి రామానాయుడు అనడంతో సురేష్ బాబు కాస్త నిరాశ పడ్డారు. క్లాసి మాస్ పిక్చర్ తీసి తప్పు చేశానా అని ఆయన మదనపడ్డారు. అయితే సురేష్ బాబు నమ్మకం నిజం చేస్తూ రెండోవారం నుంచి బొబ్బిలి రాజా కలెక్షన్లను ఊపొందుకున్నాయి. విడుదలైన ప్రతి సెంటర్లోనూ వంద రోజులు ఆడడంతో పాటు ఘనవిజయం సాధించింది. అయ్యో అయ్యో అనే వెంకటేష్ ఊతపదం ప్రేక్షకులకు తెగనిచ్చేసింది. వెంకటేష్కు తొలి సిల్వర్ జూబ్లీ సినిమాగా బొబ్బిలి రాజా రికార్డుల్లో నిలిచిపోయింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: