
తారక్ ఈ సినిమాలో నటించడం వల్ల సౌత్ లో ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. మరోవైపు తారక్ పుట్టినరోజు సందర్భంగా యమదొంగ సినిమా రిలీజ్ అయింది. రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కావడం హాట్ టాపిక్ అవుతోంది. అయితే పుట్టినరోజుకు రెండు రోజుల ముందే ఈ సినిమాను రిలీజ్ చేయడం వల్ల బుకింగ్స్ మరీ అద్భుతంగా అయితే లేవనే చెప్పాలి.
బీ సెంటర్లలో, సీ సెంటర్లలో సైతం ఈ సినిమా రిలీజ్ కావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. అయితే యమదొంగ బుకింగ్స్ ఆశాజనకంగా లేకపోవడంతో ఈ సినిమా కలెక్షన్లు ఏ స్థాయిలో ఉండబోతున్నాయనే చర్చ జోరుగా జరుగుతోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఅర్ సరైన స్క్రిప్ట్ ను ఎంచుకున్న ప్రతి సందర్భంలో భారీ సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.
తర్వాత సినిమాలు సైతం తారక్ కు కెరీర్ పరంగా భారీ సక్సెస్ ను అందిస్తాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఅర్ లుక్స్ విషయంలో సైతం కేర్ తీసుకుంటున్నారు. తన సినిమాలలో స్లిమ్ లుక్ లో కనిపించడానికి ఈ హీరో ప్రాధాన్యత ఇస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నెల్సన్ కాంబో సినిమాపై సైతం అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.