టాలీవుడ్ కమెడియన్ జయప్రకాశ్ రెడ్డి పరిచయం అవసరంలేని పేరు. ఈయన ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా నటించి ప్రేక్షకులను అలరించారు. అంతేకాదు ఈయన కొన్ని సినిమాలలో మంచి విలన్ పాత్రలలో కూడా నటించి మెప్పించారు. సాధారణంగా ఏ నటుడికైనా ఒక పాత్ర ఇస్తే, ఆ పాత్రలోనే నటిస్తారు. ప్రేక్షకులు కూడా వారిని ఆ పాత్రలో చూడడానికి ఇష్టపడతారు. కానీ జయప్రకాశ్ రెడ్డి మాత్రం అటు విలన్ గా.. ఇటు కమెడియన్ గా నటించి మంచి ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. జయప్రకాశ్ రెడ్డి ముత్యాల పల్లకి సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత సమరసింహారెడ్డి సినిమాతో వెలుగులోకి వచ్చారు. ఈ సినిమాలో ఈయన వీర రాఘవరెడ్డి అనే పాత్రను పోషించి అందర్నీ ఆకట్టుకున్నారు. అలా జయం మనదేరా, చెన్నకేశవరెడ్డి, స్నేహమంటే ఇదేరా, బావగారు బాగున్నారా, శ్రీరాములయ్య, ఆనందం, వర్షం, చత్రపతి, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, శ్రీరామదాసు, విక్రమార్కుడు, జులయి, యమదొంగ, బుజ్జిగాడు, నేనే రాజు నేనే మంత్రి, సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాలలో నటించారు. 

ఈయన తెలుగుతో పాటుగా కెనడ, తమిళం, హిందీ సినిమాలలో కూడా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఈయన దాదాపు 300కు పైగా సినిమాల్లో యాక్ట్ చేశారు. తన నటనతో ఎన్నో అవార్డులను సైతం తన సొంతం చేసుకున్నారు. అయితే జయప్రకాశ్ రెడ్డి కరోనా సమయంలో మరణించిన విషయం తెలిసిందే. గుంటూరులోని తన ఇంట్లో గుండెపోటుతో మృతి చెందారు. ఈయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటుగా మారింది. ఆ సమయంలో కరోనా భయం ఉండడం వల్ల ఆయన అంత్యక్రియలకు కూడా ఎవరు హాజరు కాలేదు. అయితే తాజాగా జయప్రకాశ్ రెడ్డి కూతురు మల్లిక రెడ్డియూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన తండ్రి కరోనాతో చనిపోయారని అందరూ అనుకున్నారని కానీ అది నిజం కాదని చెప్పారు. నిజానికి నాన్నకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెలిపింది. తన తమ్ముడి కుటుంబానికి కరోనా రావడంతో నాన్న ఒక్కరే సింగిల్ గా ఉండేవారని తెలిపింది. అలా ఒంటరిగా ఉండడం వల్ల ఆయన డిప్రెషన్ లోకి వెళ్లారని స్పష్టం చేసింది. చనిపోయే రోజు ఉదయం కూడా ఆయన బాగానే ఉన్నారని కానీ అనుకోకుండా సడన్ గా చనిపోయారని చెప్పుకొచ్చింది. నాన్న మరణించినప్పుడు సినీ ఇండస్ట్రీ నుండి ఒక్కరు కూడా రాలేదని స్పష్టం చేసింది. నాన్న దగ్గర మేనేజర్ గా పనిచేసిన ఒక వ్యక్తి మాత్రమే వచ్చారని తెలిపింది. కొంతమంది సినీ పరిశ్రమ నుంచి ఫోన్ చేశారని.. కానీ ఒక హీరో కూడా ఫోన్ చేయలేదని చెప్పుకొచ్చింది. ఎన్నో సినిమాలలో నటించిన నాన్నకి ఆయన మరణం తర్వాత సినీ పరిశ్రమ నుండి ఎలాంటి స్పందన రాకపోవడం ఎంతో బాధాకరం అని మల్లికా రెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: