ఇక చాలా రోజుగా టాలీవుడ్ లో ఎగ్జిబిటర్లు , నిర్మాతలకు మధ్య పర్సంటేజ్ వార్‌ నడుస్తూనే ఉంది .. ప్రధానంగా తమకు పర్సంటేజ్ సిస్టంలో సినిమాలను రిలీజ్ చేయాలని ఎగ్జిబిటర్లు గట్టిగా పట్టుపడుతుంటే అలా చేస్తే తమకు నష్టం వస్తుందంటున్నారు నిర్మాతలు .. ఇక ఈ క్రమంలోనే ఫిలిం ఛాంబర్ లో జరిగిన సంయుక్త రెండు రాష్ట్రాల ఎగ్జిక్యూటర్స్ మీటింగ్ కు దాదాపు 60 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. ఇక అందులో సురేష్ బాబు , దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాతలు కూడా ఉన్నారు. అయితే ఈ మీటింగ్ లో తమ డిమాండ్స్ చాంబర్ ముందు పెట్టారు ఎగ్జిబిటర్లు .. ప్రస్తుతం నడుస్తున్న అద్దె ప్రాతిపదికన‌ థియేటర్లు నడిపే పరిస్థితుల్లో తాము లేమని చెప్పేశారు థియేటర్ యజమాన్యం .
 

ఇక ఇలా చేస్తే తమకు నష్టాలు వస్తున్నాయని అంటున్నారు .. థియేటర్స్ నడపలేని స్టేజిలోకి వెళ్లిపోయామని తమ కష్టాలు చెప్పుకున్నారు. సినిమా నిర్మాతలు సహకరించి పర్సంటేజ్ విధానానికి ఓకే చెప్పాలని తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు కోరుతున్నారు .. అయితే ఇదే క్రమంలో ఎగ్జిక్యూటర్లు డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతల మధ్య ఆదాయ పంపిణీ వివాదం ఉందంటూ జూన్ 1 నుంచి సినిమా హాళ్లు బంద్ చేయాలని సంచల నిర్ణయం తీసుకున్నారు . అయితే ఈ బంద్ నిర్ణయం పై నేడు మరోసారి చర్చలు జరపనున్నారు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు. అయితే బంద్ నిర్ణయం వెనుక కుట్ర ఉందని  జన సేన ఆరోపిస్తుంది .


పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జూన్ 12 న విడుదల నేపద్యంలో ఆ నలుగురు కుట్ర చేశారంటూ తీవ్రంగా ఆరోపిస్తుంది జనసేన. అంతే కాకుండా దీని పై ఏకంగా విచారణకు ఆదేశించారు సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ . కాగా ఓ సినిమాకు 30 కోట్లకు పైగా గ్రాస్ వస్తే ఎగ్జిబిటర్ షేర్ తొలి వారం 20%  రెండో వారం 45% మూడో వారం 60 శాతం మిగిలిన వారాలు 70% వారు డిమాండ్  చేస్తున్నారు .. అలాగే 10 కోట్ల లోపు గ్రాసర్స్‌కు ఒకటవ వారం 50% రెండవ వారం 60 శాతం మిగిలిన వారాలు 70% అడుగుతున్నారు ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు .. అలాగే గత పదేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో 2000 సింగిల్ స్క్రీన్ థియేటర్లో మూతపడ్డాయి .. దాదాపు 1400 థియేటర్లు ప్రస్తుతం గట్టిగా యాక్టివ్గా ఉన్నాయి .. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరికొన్ని థియేటర్లు మూత పడక తప్పదు .

మరింత సమాచారం తెలుసుకోండి: