
ఏపీలో ఉన్న మల్టీప్లెక్స్ ల వివరాలను సైతం తాను ఆరా తీశానంటూ పవన్ కళ్యాణ్ కామెంట్లు చేయడం కొసమెరుపు. రాష్ట్రంలోని సినిమా వాళ్ల విషయంలో గుప్తాధిపత్యానికి చెక్ పెట్టే దిశగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. సీడెడ్ లో పన్నులు సరిగ్గా రావు అని పవన్ కామెంట్లు చేయడం ఒకింత సంచలనం అవుతోంది. రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లకు ఈ వార్నింగ్ ఒక విధంగా షాకేనని చెప్పాలి.
ఇండస్ట్రీలోని పెద్దల బలహీనతలను, థియేటర్ల విషయంలో వాళ్లు చేస్తున్న తప్పులను సైతం పవన్ కళ్యాణ్ బయటపెట్టారు. భారీ రెంట్లు అడుగుతున్న థియేటర్ల యజమానులు థియేటర్లలో శుభ్రతకు ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వరు. థియేటర్ల క్యాంటీన్ ఆదాయంపై కూడా పవన్ ప్రత్యేక దృష్టి పెట్టనున్న సంగతి తెలిసిందే. అధికారులకు మరింత పవర్ ఇచ్చే దిశగా పవన్ అడుగులు పడుతున్నాయి.
వ్యవస్థ లోపాలు తెలిసిన పవన్ కళ్యాణ్ తీసుకోబోయే నిర్ణయాలు థియేటర్లకు మేలు చేస్తాయో మరింత ముంచేస్తాయో చూడాలి. అయితే పవన్ కళ్యాణ్ కోపంతో ఈ విధంగా కామెంట్లు చేసినా రాబోయే రోజుల్లో కూల్ అయ్యే ఛాన్స్ ఉంది. మూలిగే నక్కపై తాటికాయ పడ్డ విధంగా ఇండస్ట్రీ పరిస్థితి రోజురోజుకు దారుణంగా అవుతోందని ఈ పరిస్థితి మారే అవకాశాలు అయితే కనిపించడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ నిర్ణయాలు ఏ సినిమాలపై ప్రభావం చూపుతాయో చూడాలి.