టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం క్రితం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమాను మొదలు పెట్టాడు. ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్గా కనిపించనుండగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఏ ఏం రత్నం ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత అనేక కారణాల వల్ల ఈ మూవీ షూటింగ్ అత్యంత డిలే అయింది. దానితో ఈ మూవీ దర్శకత్వ బాధ్యతల నుండి క్రిష్ తప్పుకున్నాడు. దానితో ఈ మూవీ యొక్క దర్శకత్వ బాధ్యతలను జ్యోతి కృష్ణ అనే దర్శకుడు తీసుకున్నాడు. క్రిష్ తప్పుకున్నాక మిగిలిన ఈ సినిమా షూటింగ్ను జ్యోతి కృష్ణ పూర్తి చేశాడు. మొత్తం ఈ మూవీ ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. 

అందులో మొదటి భాగాన్ని జూన్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా స్టార్ట్ అయ్యి చాలా కాలం అవుతున్నా ఈ మూవీ కి సంబంధించిన అప్డేట్లు పెద్దగా చాలా కాలం పాటు బయటకు రాలేదు. ఈ మధ్య కాలంలో మాత్రం ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లను మేకర్స్ వరుస పెట్టి విడుదల చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి ఓ సాంగ్ విడుదలకు సంబంధించిన అప్డేట్ను ప్రకటించింది. ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న నిధి అగర్వాల్ పోస్టర్ తో పాటు ఈ మూవీలోని "తారా తారా" అంటూ సాగే సాంగ్ను మే 28 వ తేదీన ఉదయం 10 గంటల 20 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ విడుదల చేసిన సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ నుండి విడుదల కాబోయే నెక్స్ట్ సాంగ్ అయినటువంటి తార తార పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొనే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: