టాలీవుడ్ ఇండస్ట్రీ లో కొంత మంది నిర్మాతలు తమ సినిమాలను ఎక్కువ శాతం సంక్రాంతికి విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా సంక్రాంతికి సినిమాలను విడుదల చేయడానికి అత్యంత ఆసక్తిని చూపించే తెలుగు నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ఈయన నిర్మాతగా కెరియర్ను మొదలు పెట్టి చాలా కాలం అవుతుంది. ఈయన కెరియర్ మొత్తంలో ఇప్పటివరకు ఈయన నిర్మించిన అనేక సినిమాలు సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు అద్భుతమైన విజయాలను కూడా అందుకున్నాయి. ఇక ఈ సంవత్సరం దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజర్ , సంక్రాంతికి వస్తున్నాం అనే రెండు సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. ఇందులో రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజర్ సినిమా ప్రేక్షకులను నిరాశపరచగా ... వెంకటేష్ హీరో గా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా మాత్రం అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇది ఇలా ఉంటే దిల్ రాజు తన సోదరుడి కుమారుడు అయినటువంటి ఆశిష్ హీరోగా శతమానం భవతి నెక్స్ట్ పేజ్ అనే టైటిల్తో మూవీ ని రూపొందించనున్నట్లు , దానిని ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. కానీ ఈ సినిమా మాత్రం ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదల కాలేదు. ఇక వచ్చే సంవత్సరం సంక్రాంతికి ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకువచ్చే ఆలోచనలో దిల్ రాజు ఉన్నట్లు ఓ వార్త వైరల్ అయింది. కానీ ఇప్పటికి కూడా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాకపోవడంతో వచ్చే సంక్రాంతికి అయిన శతమానం భవతి నెక్స్ట్ పేజీ థియేటర్లోకి వస్తుందా లేదా అనే అనుమానాలు కొంత మంది లో రేకెత్తుతున్నాయి. మరి రాజు శతమానం భవతి నెక్స్ట్ పేజీ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కైనా థియేటర్లలోకి దిల్ రాజు తీసుకు వస్తాడో ... లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: