
మరోవైపు ధనుష్ సైతం ఈ ఈవెంట్ లో స్పందిస్తూ నేను నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటానని తెలిపారు. నాపై నా సినిమాలపై ఎంత నెగిటివ్ ప్రచారం చేస్తారో చేసుకోండని ధనుష్ అన్నారు. నా సినిమాల విడుదలకు ముందు నెలకు రెండుసార్లు ఏదో ఒక విషయంలో కుట్రలు చేస్తూనే ఉంటారని ఆయన తెలిపారు. అయినా మీరేం చేయలేరని ఎందుకంటే నా ఫ్యాన్స్ నాతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
మీరంతా 23 సంవత్సరాలుగా నా వెంటే ఉంటున్నారని మీరెంత నెగిటివిటీ ప్రచారం చేసినా వీరంతా ఎప్పటికీ నాతోనే ఉంటారని ధనుష్ కామెంట్లు చేశారు. ఆనందంగా జీవించాలని మనం బలంగా కోరుకోవాలని అది మనలోనే మనతోనే ఉంటుందని చెప్పుకొచ్చారు. నా వరకు నేను మంచి భోజనం చేసి సంతోషిస్తానని ఆయన కామెంట్లు చేశారు. అదే నాకు ఆనందం అని ఆయన వెల్లడించారు.
మన సంతోషానికి మించి ఏమీ ఉండదని ధనుష్ వెల్లడించారు. ఇదే ఈవెంట్ లో శేఖర్ కమ్ముల సైతం మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ధనుష్ నటన గురించి శేఖర్ కమ్ముల ప్రశంసలు కురిపించారు. కుబేర మూవీలో ఆ పాత్ర ధనుష్ కాకుండా మరెవరూ చేయలేరని ఆయన పేర్కొన్నారు. ధనుష్ ఈ పాత్రలో అద్భుతంగా నటించారని ధనుష్ కు కచ్చితంగా అవార్డ్ వస్తుందని ఆయన అన్నారు. కుబేర సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించారు.