తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్లు మరింత దారుణంగా తయారయింది దీపిక పదుకొనే పరిస్థితి . ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే దీపికా పదుకొనేని దారుణాతి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . దానికి కారణం ఆమె ప్రభాస్ సినిమా కోసం అంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడమే.  నిజంగానే ఆమె రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందా..? లేకపోతే ఇదంతా పుకారా ..? అది పక్కన పెడితే ఆమె మాత్రం ప్రభాస్ "స్పిరిట్" సినిమా కోసం 20 కోట్లు అడిగింది అని ..అంత ఇచ్చుకోలేక సందీప్ రెడ్డి వంగ ఆమెని సినిమా నుంచి తీసేసారు అన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తూ వచ్చాయి .


అయితే దీపికా పదుకొనే దానికి సంబంధించి ఎక్కడా కూడా నోరు విప్పి మాట్లాడకపోవడంతో అందరూ ఇది నిజమే అనుకుంటున్నారు.  దీపిక గతంలో కూడా చాలా సినిమాల విషయాలల్లో ఇలాగే రెమ్యూనరేషన్ డిమాండ్ చేసింది అంటూ బాలీవుడ్ జనాలు గుర్తు చేసుకుంటున్నారు. అయితే దీపికా పదుకొనే సందీప్ రెడ్డివంగా ఇష్యూ అంతా ఈజీగా మర్చిపోవడం లేదు జనాలు . మరీ ముఖ్యంగా రెబల్ అభిమానులు దీపికా పై చాలా గుర్రుగా ఉన్నారు. పెద్ద పాన్ ఇండియా స్టార్ హీరోతో నటించాలి అంటే నువ్వు ఇన్ని కోట్లు డిమాండ్ చేస్తున్నావా..?  నీ కంటే ప్రభాస్ ఎంత పెద్ద హీరో అనేది నీకు తెలియదా..? అంటూ ఘాటు ఘాటుగా స్పందిస్తున్నారు.



అంతేకాదు ఈమెను అసలు తెలుగు ఇండస్ట్రీలో బ్యాన్ చేసేయాలి అని.. తెలుగు హీరోలు - డైరెక్టర్లు ఎవ్వరు ఈమెతో సినిమాను ఓకే చేయకూడదు అని.. అప్పుడు ఈమెకి బుద్ధి వస్తుంది అని..  ప్రభాస్ లాంటి హీరోతో సినిమాను ఈ విధంగా నువ్వు కండిషన్స్ పెట్టి పాడు చేసుకున్నావా..? అంటూ రెబెల్ ఫాన్స్ కూసింత ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు . అంతేకాదు నాగ్ అశ్వీన్ కల్కి 2 లో దీపికా పదుకొనేను సినిమా నుంచి తీసేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.  ఒకవేళ దీపిక ని పెట్టుకుంటే నీ ఈ సినిమాలో పెట్టుకుంటే మీ నెక్స్ట్ సినిమా ఫ్లాప్ చేస్తామంటూ బెదిరిస్తున్నారు.  సోషల్ మీడియాలో ఇప్పుడు దీపికా పదుకొనే పై దారుణమైన ట్రోలింగ్ జరుగుతుంది . చూడాలి తెలుగు ఇండస్ట్రీలో దీపికాను దూరం పెట్టేస్తారా..? లేకపోతే ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి ధైర్యంగా ఆమెతో సినిమాను ఓకే చేస్తారా..? దీపిక పదుకొనే మాత్రం ఈ విషయం పై ఏ విధంగా రియాక్ట్ అవ్వడం లేదు..!

మరింత సమాచారం తెలుసుకోండి: