టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన అనుష్క ప్రస్తుతం లిమిటెడ్ గా సినిమాల్లో నటిస్తున్నా ఆమెకు ఉన్న క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. అనుష్క, క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఘాటి జులై నెలలో థియేటర్లలో రిలీజ్ కానుంది. గతంలో ఈ కాంబినేషన్ లో వేదం సినిమా తెరకెక్కగా ఈ సినిమా కమర్షియల్ రిజల్ట్ ఎలా ఉన్నా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలోని పాత్రలు నిజ జీవిత పాత్రలను గుర్తు చేసే విధంగా ఉంటాయి.
 
ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందించగా ఈ సినిమాలోని పాటలు సైతం ఊహించని స్థాయిలో హిట్ గా నిలిచాయి. ఈ మూవీలోని రూపాయ్ పాటకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమా విడుదలై 15 సంవత్సరాలు కాగా ఈ మూవీ ఎక్కువ సంఖ్యలో అవార్డులను సైతం సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ మంచి సినిమా చెయ్యి నేను డేట్స్ ఇస్తా అని క్రిష్ కు చెప్పి వేదం సినిమాలో నటించారు.
 
వేదం సినిమా కథను భయపడుతూనే క్రిష్ అనుష్కకు చెప్పగా ఈ సినిమా కథ వింటున్నంత సేపు అనుష్క ఎమోషనల్ అయ్యారట. కథ విన్న వెంటనే సరోజ పాత్రకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వేశ్య పాత్రలో అనుష్క అద్భుతంగా నటించారు. అయితే ఈ సినిమా పబ్లిసిటీలో భాగంగా అనుష్క వెనుకవైపు నుంచి కొంటెగా చూస్తున్న పోస్టర్ హోర్డింగ్ ను పంజాగుట్ట సెంటర్ లో ఏర్పాటు చేశారు.
 
అయితే ఆ పోస్టర్ వల్ల అప్పట్లో పంజాగుట్ట సెంటర్ దగ్గర 40కు పైగా యాక్సిడెంట్లు జరిగాయట. ఇందుకు సంబంధించి పోలీసులకు సైతం ఫిర్యాదులు అందడంతో పోలీసులు, జీ.హెచ్.ఎం.సీ సిబ్బంది ఆ హోర్డింగ్ ను తొలగించారు. అనుష్క పోస్టర్ తో ప్రేక్షకులను అంతలా మాయ చేశారు. సాధారణంగా ఇలాంటి రిస్కీ రోల్స్ లో నటిస్తే స్టార్స్ పక్కన ఆఫర్లు రావని హీరోయిన్లు భయపడతారు.
 
అయితే అనుష్క మాత్రం అలాంటి టెన్షన్ లేకుండా ఈ సినిమాలో నటించి మెప్పించారు. ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును సైతం సొంతం చేసుకున్నారు. క్రిష్ అనుష్క ఘాటి సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో మ్యాజిక్ చేస్తారో చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: