- ( టాలీవుడ్‌ - ఇండియా హెరాల్డ్ )

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్గా దర్శకుడు క్రిష్ మరియు ఎం జ్యోతి కృష్ణ సంయుక్తంగా తెర‌కెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌ పై సీనియర్ నిర్మాత ఏం రత్నం దాదాపు రు. 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా దాదాపు నాలుగైదు సంవత్సరాలుగా వార్తల్లో నలుగుతూ షూటింగ్ జరుపుకుంటూ వస్తోంది. పవన్ ఎట్టకేలకు డేట్ లో ఇవ్వడంతో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వాస్తవంగా ఈ నెల 12న థియేటర్లలోకి రావాల్సి ఉంది. అయితే అనూహ్య‌ కారణాలవల్ల ఈ సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. త్వరలోనే మంచి డేట్ చూసుకుని రిలీజ్ చేస్తామని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటికే పలుసార్లు ఈ సినిమా వాయిదాల‌ మీద వాయిదాలు పడుతూ వస్తుంది. అయితే ఈ సినిమా ఓటిటీ హక్కులు సొంతం చేసుకున్న అమొజాన్ ప్రైమ్ వీడియో ఇప్పుడు మేకర్స్‌కు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.


గతంలో కూడా అమెజాన్ ప్రైమ్ వారు సినిమా ఆన్ టైంలో రావాలని ప్రెజర్ చేసినట్టు ఠాకూర్ ఇప్పించింది ఈసారి మాత్రం అల్టిమేట్ చేసినట్టు సమాచారం గతంలో రెండుసార్లు మిస్ చేసిన డేట్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు .. ఈసారి మాత్రం జూలై ఎండింగ్లోపే థియేటర్స్ లో సినిమా విడుదల చేయాలని .. లేకపోతే తాము చేసుకున్న ఓటీటీ ఒప్పందాన్ని పునః పరిశీలించాల్సి ఉంటుందని నిర్మాతలకు వార్నింగ్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. సో ఈసారి హరిహర వీరమల్లు ఎటు పరిస్థితులలోనూ జూన్ ఎండింగ్ లోపు థియేటర్లలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: