
కుబేర కి లెంత్ ఎక్కువైందని విమర్శ విన్నాను .. నిజానికి లెంత్ గురించి ఒక దర్శకుడికి , టీం కి తెలియకుండా ఉండదు .. కానీ ఇది చెప్పాల్సిన విషయం .. కచ్చితంగా చెప్పి తీరాలి .. ఒక పాయింట్ ను నిజాయితీగా చెప్పటమే మాకున్న ధర్మం .. అందులో చాలా లేయర్స్ చెప్పడానికి ఎంతో ప్రయత్నించాను .. ఆ క్రమంలోనే కాస్త లెంత్ పెరిగి ఉండవచ్చు .. అయితే ఈ సినిమా మీరు మరోసారి చూసినప్పుడు మీకు తెలియని లేయర్స్ కొత్తగా కనిపిస్తాయి అంటూ శేఖర్ చెప్పుకొచ్చారు .. అదే విధంగా కుబేరని తన కెరీర్ లోనే ట్రూ ఫిల్ జాబితాలో చేర్చారు .. అలాగే నేను చేసిన సినిమాల్లో కుబేర వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ , హానెస్ట్ , ట్రూ ఫిలిం .. అలాగే ఈ సినిమాకి వచ్చిన యునానిమస్ రిపోర్ట్స్ తో నాకు ఎంతో ఆనందంగా ఉంది అని తన ఆనందాన్ని పంచుకున్నారు శేఖర్ కమ్ముల ..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు