ఏంటి తెలుగు బిగ్ బాస్ 2 టైటిల్ విన్నర్ కౌశల్ మందా అలాంటివారా..నిజంగానే అమ్మాయిలతో వ్యాపారం చేస్తారా.. కొత్త అమ్మాయిల్ని వాళ్ల దగ్గరికి పంపిస్తారా... సోషల్ మీడియాలో వినిపించే ఈ ఆరోపణలో ఉన్న నిజం ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. కౌశల్ మందా ఈయన పేరు చెప్తే తెలియని వారు ఉండరు. తెలుగు బిగ్ బాస్ 2 టైటిల్ విన్నర్ గా అలాగే పలు సినిమాల్లో విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లు పోషించిన కౌశల్ కేవలం సినిమాల్లోనే కాకుండా సీరియల్స్ లో కూడా రాణించారు. ఇక రీసెంట్గా మంచు విష్ణు నటించిన కన్నప్ప మూవీలో మంచు విష్ణు ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించారు. అయితే తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కౌశల్ మందా తనపై వచ్చిన ఆరోపణల పై క్లారిటీ ఇచ్చారు.. కౌశల్ మందా గతంలో కాస్టింగ్ డైరెక్టర్ గా పని చేశారు. 

కొత్త అమ్మాయిల్ని సినిమాలకు పరిచయం చేసేవారు. అలా ఎంతోమంది హీరోయిన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.ముఖ్యంగా హైదరాబాదులో మొట్టమొదటి క్యాస్టింగ్ డైరెక్టర్ కౌశల్ మందనేనట. అయితే సడన్గా తన వృత్తిని కౌశల్ మందా వదిలేశారు. దానికి కారణం కొంతమంది కొత్త అమ్మాయిల్ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తే అమ్మాయిలని సరఫరా చేస్తున్నాడు అంటూ చాలా బ్యాడ్ గా వేరే విధంగా మాట్లాడారట. ఇక ఒకసారి బయటపడడంతో మళ్ళీ దాని జోలికి పోకూడదని కౌశల్ మందా క్యాస్టింగ్ డైరెక్టర్గా మానేశారట.మోడలింగ్ రంగంలో రాణించినప్పటికీ కాస్టింగ్ డైరెక్టర్ గా తన వృత్తిని పక్కన పెట్టానని తాజా ఇంటర్వ్యూలో కౌశల్ మందా చెప్పుకొచ్చారు.

అంతే కాదు హైదరాబాదులో నేనే మొట్టమొదటి క్యాస్టింగ్ డైరెక్టర్ అని ఇప్పటికి కూడా అలాగే కొనసాగితే హైదరాబాదులోనే అతిపెద్ద క్యాస్టింగ్ కంపెనీగా నా కాస్టింగ్ కంపెనీ కి పేరు ఉండేదని,కానీ నా మీద బ్యాడ్ కామెంట్లు రావడంతో ఆ వృత్తిని పక్కన పెట్టి నా దగ్గర పని చేసిన వారికి అన్ని బాధ్యతలు అప్పజెప్పాను అంటూ కౌశల్ మందా చెప్పుకొచ్చారు. అయితే చాలామంది డైరెక్టర్లు ఈ వృత్తిని వదిలేయకు నీవల్ల సినిమాలకు బాగా హెల్ప్ అవుతుంది అని చెప్పారట. అయినా కూడా తనమీద బ్యాడ్ క్యారెక్టర్ అనే ముద్ర పడడంతో ఆ వర్క్ వదిలేసానని కౌశల్ మందా తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.. ఇక కౌషల్ మందా బిగ్ బాస్ లో ఉన్నప్పుడు కౌశల్ ఆర్మీ పేరుతో బయట నానా రచ్చ జరిగిన సంగతి మనకు తెలిసిందే. చివరికి బిగ్ బాస్ 2 టైటిల్ విన్నర్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: