మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని భాగ్య శ్రీ బోర్స్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన మిస్టర్ బచ్చన్ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయిన ఈ మూవీ తో ఈమెకు మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో వచ్చింది. దానితో ఇప్పటికే ఈమె విజయ్ దేవరకొండ హీరో గా రూపొందిన కింగ్డమ్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే విడుదల కానుంది.

ఇకపోతే ఈ బ్యూటీ ప్రస్తుతం రామ్ పోతినేని హీరోగా రూపొందుతున్న ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న కాంత మూవీ లో హీరోయిన్గా నటిస్తోంది. ఇలా రెండు సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ కి అఖిల్ హీరోగా రూపొందుతున్న లెనిన్ అనే మూవీ లో కూడా హీరోయిన్గా అవకాశం దక్కింది. కొన్ని రోజుల క్రితమే లెనిన్ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడిన రోజే ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా కనిపించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

అలాగే అందుకు సంబంధించిన ఒక వీడియోను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ సినిమా నుండి శ్రీలీల తప్పుకుంది. దానితో భాగ్య శ్రీ ని ఈ మూవీ లో హీరోయిన్గా ఎంచుకున్నారు. ఇక ప్రస్తుతం ఏకంగా మూడు సినిమాలతో ఈ ముద్దు గుమ్మ బిజీగా ఉండడంతో అనేక ప్రాంతాలను తిరగవలసి వస్తున్నట్లు తెలుస్తోంది. దానితో ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఆనందంతో కూడిన కష్టాలను అనుభవిస్తున్నట్లు కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: