
200 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కన్నప్ప సినిమా.. బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే అన్నట్లుగా కనిపిస్తోంది. డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా మంచు విష్ణు నే సొంత బ్యానర్లు ఈ సినిమాని నిర్మించారు. కన్నప్ప సినిమా కలెక్షన్స్ కి కూడా పైరసీ దెబ్బ పడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం పైన నిన్నటి రోజున మంచు విష్ణు కూడా మాట్లాడడం జరిగింది.
రాబోయే రోజుల్లో ఇలాంటివి జరగకుండా పలు రకాల చర్యలు తీసుకుంటామంటూ వెల్లడించారు. ఎవరైనా ఎక్కడైనా ఇలాంటి లింకులు చూస్తే తనకు డైరెక్ట్ గానే ట్విట్టర్లో మెసేజ్ చేయవచ్చు అంటూ డైరెక్ట్ గానే చెప్పేశారు విష్ణు.. కన్నప్ప సీక్వెల్ ఉంటుందా అనే విషయం పైన చాలామంది ప్రశ్నించగా ఉండదు అంటు తెలియజేశారు. మరి తన తదుపరి చిత్రాన్ని ఏమైనా మంచు విష్ణు తెలుపుతారేమో చూడాలి మరి. అభిమానులు మాత్రం కన్నప్ప సినిమాతో కొంతమేరకు ఊపిరి పీల్చుకున్నట్లుగా కనిపిస్తోంది. మరి ఫైనల్ గా బ్రేక్ ఈవెన్ సాధించి అభిమానులను ఆనందపరుస్తుందో లేదా చూడాలి కన్నప్ప చిత్రం.