పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో ఓజి అనే మూవీలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో పవన్ కి జోడిగా కనిపించనుండగా ... డి వి వి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. అర్జున్ దాస్ ఈ మూవీ లో అత్యంత కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే ఈ సినిమాను ఈ సంవత్సరం సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి "విశ్వంభర" అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

త్రిష ఈ మూవీ లో హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... మల్లాడి వశిష్ట ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ స్ స్టార్ట్ అయి చాలా కాలమే అవుతుంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మొదట మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ సినిమాకు సంబంధించిన చాలా పనులు పెండింగ్ ఉండడంతో ఈ మూవీ ని సంక్రాంతి పని నుండి తప్పించారు. ఇప్పటివరకు ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. ఇకపోతే ఓజి సినిమా వాయిదా పడే అవకాశం ఉంది అని ఓ వార్త వైరల్ అవుతుంది.

దానితో ఓజి మూవీ కనుక వాయిదా పడితే ఆ తేదీన విశ్వంభర వచ్చే అవకాశాలు ఉన్నాయి అని ఓ వార్త వైరల్ అవుతుంది. సెప్టెంబర్ 25 వ తేదీన బాలకృష్ణ హీరోగా రూపొందిన అఖండ 2 మూవీ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఒక వేళ ఓజి పోస్ట్ అయ్యి విశ్వంభర విడుదల అయినా కూడా ఈ సినిమాకు అఖండ 2 మూవీ నుండి భారీ పోటీ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: