టాలీవుడ్ ఇండస్ట్రీ ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటి మణులలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈమె వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని , మంచి గుర్తింపును దక్కించుకుంది. ఆ తర్వాత ఈమె ఎంతో మంది టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో నటించి చాలా తక్కువ కాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. కానీ ప్రస్తుతం మాత్రం ఈమె తెలుగు సినిమాల్లో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఈమె ఆఖరుగా కొండపొలం అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది.

ఆ తర్వాత ఈమె ఏ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఈమె వరస పెట్టి తమిళ్ , హిందీ సినిమాలలో నటిస్తూ వస్తుంది. ఇకపోతే ఈమె కొంత కాలం క్రితం బాలీవుడ్ ప్రొడ్యూసర్  అయినటువంటి జాకీ భగ్నాని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వీరి సంసార జీవితం ఎంతో ఆనందంగా ముందుకు సాగుతుంది. ఇకపోతే తాజాగా రకుల్ భర్త అయినటువంటి జాకీ , అక్షయ్ కుమార్ , టైగర్ షార్ఫ్ హీరోలుగా రూపొందిన బడే మియా చోటే మియా అనే సినిమాను రూపొందించారు. ఈ మూవీ ని జాకీ భారీ బడ్జెట్ తో రూపొందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక ఈ మూవీ కి అత్యంత తక్కువ కలెక్షన్లు రావడంతో ఈ సినిమా ద్వారా రకుల్ భర్త చాలా నష్టాల్లోకి వెళ్లిపోయాడు అని , దివాలా తీసే పరిస్థితుల్లో ఉన్నాడు అని , ఇలా అనేక రకాల వార్తలు బయటకు వచ్చాయి.

తాజాగా ఈ వార్తలపై జాకీ స్పందించాడు. మేము దివాలా తీసాము అని వస్తున్న వార్తలు అన్నీ అవాస్తవం. మేము సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఆ సినిమా కోసం మేము జూహు ఆఫీస్ ను తనక బెట్టం. ఆ తర్వాత సినిమా విడుదల అయ్యాక మేము మా ఆఫీస్ ను వెనక్కు తెచ్చుకున్నాం. అంతకు మించి నాకు ఆ సినిమా వల్ల ఏ నష్టం జరగలేదు అని ఆయన చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: