తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని సంవత్సరాల క్రితం స్టార్ హీరోలుగా కెరియర్ను కొనసాగించిన సీనియర్ ఎన్టీఆర్ , నాగేశ్వరరావు , కృష్ణ , శోభన్ బాబు ఇంకా మరి కొంత మంది హీరోలు అనేక మల్టీ స్టారర్ సినిమాలలో నటించారు. అలా నటించిన సినిమాల ద్వారా వారు అనేక విజయాలను కూడా అందుకున్నారు. ఇక ఆ తర్వాత కాలంలో స్టార్ హీరోలుగా తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగిన వారు మాత్రం ఎక్కువగా శాతం మల్టీ స్టారర్ సినిమాల్లో నటించలేదు. దానితో కొన్ని సంవత్సరాల పాటు మన తెలుగు సినీ పరిశ్రమలో భారీ క్రేజ్ కలిగిన మల్టీ స్టారర్ మూవీలే రాలేదు. అలాంటి సమయం లోనే సూపర్ స్టార్ మహేష్ బాబు , విక్టరీ వెంకటేష్ కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాలో నటించారు.

చాలా కాలం తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో వచ్చిన భారీ మల్టీ స్టారర్ మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఆ తర్వాత నుండి కొన్ని మల్టీ స్టారర్ మూవీలు వచ్చాయి. అందులో కొన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను కూడా అందుకున్నాయి. కానీ వెంకటేష్ మాత్రం మల్టీ స్టారర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. ఇప్పటివరకు వెంకటేష్ అనేక మంది హీరోలతో మల్టీ స్టారర్ సినిమాల్లో నటించాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తర్వాత వెంకటేష్ , రామ్ పోతినేని తో కలిసి మాసాల మూవీ లో నటించాడు.

ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసి గోపాల గోపాల సినిమాలో కూడా నటించాడు. ఇకపోతే ప్రస్తుతం చిరంజీవి , అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో క్యామియో పాత్రలో నటించడానికి వెంకీ రెడీ అయ్యాడు. అలాగే బాలకృష్ణతో కూడా ఓ సినిమా చేయడానికి రెడీ అయినట్లు వెంకటేష్ తాజాగా చెప్పుకొచ్చాడు. ఇలా వెంకటేష్ ఇతర హీరోలతో కలిసి నటించడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తూ అద్భుతమైన రీతిలో ముందుకు సాగుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: