సినిమా ఇండస్ట్రీలో ఒక భారీ ఫ్లాప్ వచ్చిన తర్వాత అంతకుమించిన క్రేజీ ఆఫర్ మీడియం రేంజ్ హీరోలకు చాలా అరుదుగా దక్కుతూ ఉంటుంది. అలాంటి ఆఫర్ ని టాలీవుడ్ యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన నటులలో సిద్దు జొన్నలగడ్డ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో నటించాడు. కానీ ఈయనకు మంచి విజయం మాత్రం డీజే టిల్లు మూవీతో దక్కింది. ఈ మూవీ ద్వారా ఈయనకు యూత్ ఆడియన్స్ లో సూపర్ క్రేజ్ లభించింది. ఈ సినిమా తర్వాత ఈయన డీజే టిల్లు అనే మూవీ లో హీరో గా నటించాడు.

సినిమా కూడా సూపర్ సాలిడ్ విజయం సాధించడంతో ఈయన క్రేజ్ ఒక్క సారిగా అమాంతం పెరిగిపోయింది. ఇలా వరుసగా రెండు బ్లాక్ బాస్టర్లను అందుకున్న ఈయన కొంత కాలం క్రితం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన జాక్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వైష్ణవి చైతన్య ఈ మూవీలో హీరోయిన్గా నటించింది. వరుస బ్లాక్ బాస్టర్ల తర్వాత సిద్దు నటించిన సినిమా కావడంతో ఈ మూవీపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం సిద్దు "తెలుసు కదా" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీపై కూడా భారీ ఎత్తున అంచనాలు లేవు. జాక్ మూవీ ఫ్లాప్ కావడం , తెలుసు కదా సినిమాపై కూడా భారీ అంచనాలు లేకపోవడంతో సిద్దుకు మంచి క్రేజీ ఆఫర్ రావడానికి కాస్త సమయం పడుతుంది అని కొంత మంది అనుకున్నారు.

కానీ సిద్దు మాత్రం మరో క్రేజీ ఆఫర్ను కొట్టేసినట్లు తెలుస్తోంది. సిద్దు , రవికాంత్ పెరెపు దర్శకత్వంలో రూపొందిన  కృష్ణ అండ్ హిజ్ లీల మూవీ తో మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. మరోసారి ఈయన దర్శకత్వంలో సూర్య దేవర నాగ వంశీ నిర్మాణంలో సిద్దు మరో మూవీ చేయబోతున్నట్లు. ఈ మూవీ బడ్జెట్ ఏకంగా 80 కోట్లు అని తెలుస్తుంది. ఇలా సిద్దు మరో క్రేజీ ఆఫర్ ను దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: