టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు యాంకర్ గా ఇండస్ట్రీ ఓ వెలుగు వెలిగిన హాట్ భామ ఉదయభాను.. అయితే ఈ మధ్యకాలంలో ఉదయభాను ఎక్కువగా ఈవెంట్స్ లో, షోలలో కనిపించడం లేదు. ఎప్పుడో ఏదో ఒక సినిమా ఈవెంట్లో తప్ప ఎక్కడా కూడా కనిపించడం లేదు. దీంతో ఉదయభాను అభిమానులందరూ ఆమె యాంకరింగ్ కోసం చాలా ఎదురు చూస్తున్నారు. అయితే అలాంటి యాంకర్ ఉదయభాను తాజాగా టాలీవుడ్ లో పెద్ద మాఫియా, సిండికేట్ జరుగుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మరి ఇంతకీ ఉదయభాను ఏం మాట్లాడింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయభాను తాజాగా సుహాస్ హీరోగా చేసిన ఓ భామా అయ్యో రామ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హోస్ట్ గా వ్యవహరించింది. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఉదయభాను ని చూసి డైరెక్టర్ విజయ్ కనకమేడల షాక్ అయిపోయారు.

 ఇదేంటి చాలా రోజుల తర్వాత ఉదయభానుని చూస్తున్నాం..మళ్లీ మిమ్మల్ని ఇలా చూడడం చాలా సర్ప్రైజింగ్ ఉంది చాలా థాంక్స్ అంటూ చెప్పడంతో మైక్ అందుకున్న ఉదయభాను ఇదొక్కటే చేస్తున్నానండి..ఒకవేళ రేపు ఈవెంట్ కి ఛాన్స్ వచ్చినా కూడా చేస్తాననే నమ్మకం నాకు లేదు.ఎందుకంటే ఇవాళ రేపు ఈవెంట్ ఉందని చెబుతారు. మళ్ళీ రేపటిలోగా చేతులు మారిపోతాయి. టాలీవుడ్ లో పెద్ద సిండికేట్ మాఫియా పెరిగిపోయింది. సుహాస్ బంగారం కాబట్టి నాకు ఛాన్స్ ఇచ్చారు. ఇందులో చేయగలిగాను నా మనసులో ఉన్న మాటే చెబుతున్నాను..అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది ఉదయభాను.అయితే తనకి అవకాశాలు రానివ్వకుండా కొంతమంది యాంకర్లు తొక్కిస్తున్నారని ఉదయభాను చెప్పకనే చెప్పింది.

గత సంవత్సరం కూడా ఓ ఈవెంట్లో నాకు వచ్చిన అవకాశాలు అన్నీ వేరే వాళ్ళు తీసుకుంటున్నారని, నన్ను ఇండస్ట్రీలోకి రాకుండా తొక్కేస్తున్నారని,కానీ వారు ఎన్ని చేసినా కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కోసం నేను ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడింది. అయితే తాజా ఈవెంట్ లో కూడా ఉదయభాను అలాగే మాట్లాడంతో చాలామంది నెటిజన్లు ఉదయభానుకి అవకాశాలు రాకుండా చేస్తున్నది ఇప్పటి యాంకర్లే కావచ్చు అని మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఉదయభాను మాట్లాడిన మాటలు మాత్రం టాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇక టాలీవుడ్ లో సిండికేట్, మాఫియా వంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిందంటే ఉదయభానుని గట్టిగానే హర్ట్ చేశారని అర్థం చేసుకోవచ్చు అంటున్నారు ఆమె అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: