‘ఆర్ ఆర్ ఆర్’ తరువాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘వార్ 2’ భారీ బడ్జెట్ తో తీసిన ఈ మూవీలో బాలీవుడ్ టాప్ హీరో హృతిక రోషన్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఆగష్టు 15ను టార్గెట్ చేస్తూ విడుదలకాబోతున్న ఈమూవీ ప్రమోషన్ దేశవ్యాప్తంగా ప్రారంభం అయింది.

అయితే ఈసినిమాకు సంబంధించి హడావిడి టాలీవుడ్ లో ఇంకా ప్రారంభం కాకపోవడంతో తారక్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. అయితే ‘వార్ 2’ ప్రమోషన్ హడావిడి తెలుగు రాష్ట్రాలలో ఇంకా ప్రారంభం కాకపోవడానికి విజయ్ దేరకొండ ‘కింగ్ డమ్’ కారణం అని అంటున్నారు. ఈ నెలాఖరున జూలై 31వ తేదీ ‘కింగ్ డమ్’ విడుదల అవుతున్న విషయం తెలిసిందే.

ఈసినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఏఏమూవీ పై భారీ స్థాయిలో ఖర్చు పెట్టారు. ఇదే నిర్మాణ సంస్థ ‘వార్ 2’ సినిమా తెలుగు వెర్షన్ హక్కులను తీసుకుంది. దీనితో సితార ఎంటర్ టైన్మెంట్స్ ముందు ఈనెలాఖరున విడుదల కాబోతున్న ‘కింగ్ డమ్’ ప్రమోషన్ పై దృష్టిపెట్టి ఆతరువాత ఆగష్టు 15న విడుదలకాబోతున్న జూనియర్ ‘వార్ 2’ ప్రమోషన్ పై దృష్టి పెట్టాలని సితార సంస్థ భావిస్తూ ఉండటంతో ‘వార్ 2’ ప్రమోషన్ తెలుగు రాష్ట్రాలలో చాల తక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

వరస ఫ్లాప్ లతో సతమతమైపోతున్న విజయ్ దేవరకొండకు ప్రస్తుతం అతడి మార్కెట్ నిలబడాలి అంటే ఒక భారీ హిట్ కావాలి. దీనితో ఈమూవీని పాన్ ఇండియా రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్ మధ్య ‘వార్ 2’ ప్రమోషన్ కలిసిపోతే ‘కింగ్ డమ్’ కు ఆశించిన స్థాయిలో కలక్షన్స్ రావు అన్న అంచనాలతో సితార సంస్థ తన దృష్టిని అంతా ‘కింగ్ డమ్’ పై పెట్టడంతో ‘వార్ 2’ మౌనం వెనుక ‘కింక్ డమ్’ ఉంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..    


మరింత సమాచారం తెలుసుకోండి: