
శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆయనకు మంచి బిగ్ హిట్ ఇచ్చింది . నిజానికి ఈ కథను వేరే హీరో కోసం అనుకున్నారట గోపీచంద్ మల్లినేని. ఆయనకి కధ కూడా వివరించారట. కానీ ఆయన రిజెక్ట్ చేశారట. ఎంతో ఇష్టంగా రాసుకున్న కధ రిజెక్ట్ చేయడంతో గోపిచంద్ మల్లినేని బాధపడ్డారట. రవితేజ తో ఓ రోజు ఆయన ఇంటి వద్దకు వెళ్లి సరదాగా కబుర్లు చెప్తున్నా మూమెంట్లో ఈ విషయాన్ని ప్రస్తావించారట డైరెక్టర్.
ఒక హీరో ఇలా కథను రిజెక్ట్ చేశారు అని చెప్పగానే "సరే ఆ కధను మనం చేసేద్దాం.. కాల్ షీట్స్ రెడీ ..సెట్స్ పై కి తీసుకెళ్ళి పోదాం" అంటూ అసలు సినిమా కథ ఏంటి ..? ఆయన క్యారెక్టర్ ఏంటి ..? ఆయన రెమ్యూనరేషన్ ఏంటి..? అనేవి తెలియకుండానే సినిమా అగ్రిమెంట్ పై సైన్ చేసేసారట . ఆ తర్వాత క్రాక్ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనేది అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా క్రాక్ సినిమాలో రవితేజ చెప్పే కొన్ని కొన్ని డైలాగ్స్ హైలెట్ గా ఉంటాయి . ఎన్నిసార్లు చూసిన సరే అవి తనివి తీరవు ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తూ ఉంటుంది . మాస్ మహారాజా ఫ్యాన్స్ కు బాగా ఫుల్ మిల్స్ అందించేసింది ఈ మూవీ. ఈ మధ్యకాలంలో రవితేజ హిట్ అందుకున్న మూవీస్ లేవు. కొత్తగా ఆయన హిట్ అందుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు . పలు హీరోల సినిమాలలో స్పెషల్ క్యారెక్టర్స్ లల్లో కూడా కనిపిస్తున్నాడు. చూద్దాం మరి రవితేజ కెరీర్ ఎలా ఉండబోతుంది అనేది...???