ఇది నిజంగా మహేష్ బాబు అభిమానులకి వెరీ బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి . మహేష్ బాబు ప్రెసెంట్ రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా కోసమే ఈగర్  వెయిట్ చేస్తున్నారు ఘట్టమనేని అభిమానులు.  అయితే మహేష్ బాబు ఈ సినిమాలో కనిపించాలి అంటే దాదాపు రెండు సంవత్సరాల పైగానే వెయిట్ చేయాలి. ఇది రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోతుంది అని జనాలు బాగా గుర్తుంచుకుని మరి సినిమా రిలీజ్ డేట్ ఆలస్యం అవుతుంది అని అంటున్నారు. ఆయన లాస్ట్ గా నటించిన సినిమా "గుంటూరు కారం".


సినిమా అభిమానులను ఆకట్టుకోలేకపోయింది . హ్యూజ్ ట్రోల్లింగ్ కూడా ఫేస్ చేసాడు మహేష్ బాబు.  కాగా  ఈ సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలి అంటూ భీష్మించుకొని మరి రాజమౌళి సినిమాకు కమిట్ అయ్యాడు మహేష్ బాబు . అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వాలి అంటే చాలా టైం పడుతుంది . అప్పటివరకు తెరపై మహేష్ బాబును చూడకుండా అభిమానులు ఉండలేరు.  ఈ క్రమంలోనే ఓ సినిమాలో మహేష్ బాబు స్పెషల్ గెస్ట్ అపీరియన్స్ ఇవ్వబోతున్నాడు అన్న వార్త బాగా ట్రెండ్ అయ్యింది.



అదేంటో కాదు ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా సాబ్.  ఈ సినిమాలో ఆయన స్పెషల్ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో పాటు ఒక రెండు నిమిషాల పాటు స్పెషల్ క్యారెక్టర్ లో మెరవబోతున్నాడు అన్న న్యూస్ బాగా ట్రెండ్ అయింది.  అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ క్యారెక్టర్ ఇక లేదు అంటూ తెలుస్తుంది . వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఓకే చేసిన మహేష్ బాబు సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ లో మెరవడానికి ఒప్పుకోలేదట . రాజమౌళి సినిమా లుక్స్ ముందుగానే లీక్  అయిపోతాయి అన్న కారణంగానే ఈ విధంగా చేశాడు అన్న న్యూస్ వైరల్ అవుతుంది. దీంతో  మహేష్ బాబు అభిమానులకు బ్యాడ్ న్యూస్ వినాల్సిన పరిస్థితి వచ్చింది . మహేష్ బాబును తెరపై చూడాలి అంటే దాదాపు మూడు సంవత్సరాలు పాటు ఆగాల్సిందే అంటున్నారు అభిమానులు . చూద్దాం మరి ఏం జరుగుతుందో..???

మరింత సమాచారం తెలుసుకోండి: