
అయితే సడన్ గా ఎవరు ఊహించని విధంగా అనుష్క రిస్కీ పని చేయబోతుంది అన్న వార్త తెరపైకి వచ్చింది . సైజ్ జీరో సినిమాకి ఆమె ఏ విధంగా రిస్క్ చేసి బరువు పెరిగిందో అందరికీ తెలిసిందే . అప్పుడు పెరిగిన బరువు ఇప్పటికీ తగ్గలేక పోతుంది . అయితే ఇప్పుడు మరొక కాన్సెప్ట్ ఓరియంటెడ్ రోల్ కోసం అనుష్క మళ్ళీ బరువు పెరగబోతుందట . సైజ్ జీరో సినిమాకి ఏ విధమైనటువంటి రిస్క్ చేసిందో మళ్ళీ అదే రిస్క్ చేస్తుందట . ఈ సినిమా తనకి మంచి పేరు తీసుకొస్తుంది అన్న నమ్మకంతోనే ఆమె ఈ విధంగా బరువు పెరగడానికి ఓకే చేసిందట. అయితే అనుష్క తీసుకున్న డెసిషన్ 100 కి 100% రాంగ్ అంటున్నారు అభిమానులు .
అనుష్క ఆల్రెడీ వెయిట్ పెరిగిపోయింది. అందుకే ఎక్కడా కూడా బయట కనిపించడం లేదు. రీసెంట్ బాహుబలి సినిమా రిలీజ్ అయి 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న ఆ మీట్ లోను కనిపించలేదు. సినిమా అవకాశాలు కూడా తగ్గుతున్నాయి. ఇలాంటి మూమెంట్లో మళ్ళీ ఆమె రిస్కీ పని చేయడం అవసరమా..? ఒక్క సినిమా కోసం బరువు పెరిగితే మరి మిగతా సినిమాల పరిస్థితి ఏంటి..?? అంటూ మండిపడుతున్నారు. అనుష్క ఫూచర్ ని ఆలోచించి ఈ సినిమా నుంచి తప్పుకుంటే మంచిది అంటున్నారు. చూడాలి మరి అనుష్క ఏం చేస్తుందో..???