- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న తాజా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌ మిరాయి. ఇప్పటికే టాలీవుడ్‌లో హైప్ క్రియేట్ చేస్తోంది. విశిష్టమైన కాన్సెప్ట్, ఇంటర్నేషనల్ లెవెల్ విజువల్స్, మరియు జపాన్ నేప‌థ్యంలో క‌థ ఉండ‌డంతో హైప్ మామూలుగా లేదు. దర్శక నిర్మాతలు తీసుకున్న శ్రద్ధతో ఈ సినిమా చుట్టూ భారీ అంచనాలు టాలీవుడ్‌లో నెలకొన్నాయి. ఈ సినిమా నాన్-థియేట్రికల్ హక్కుల విషయంలో ఇప్పటికే ఓ అరుదైన రికార్డు సృష్టించింది. తాజా సమాచారం ప్రకారం, మిరాయి సినిమా థియేటర్ బిజినెస్ రూ. 55 కోట్ల మార్క్‌ దాటింది. ఓ యువ హీరో సినిమా నాన్-థియేట్రికల్ హక్కుల విషయంలో ఇంత భారీగా రాబట్టడం నిజంగా గ్రేట్‌. ఇది తేజ సజ్జా కెరీర్‌లోనే కాకుండా, యంగ్ హీరోలలో కూడా ఒక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.


మిరాయి డిజిటల్ రైట్స్‌ను ఓ ఓటీటీ సంస్థ దాదాపు రు. 30 కోట్లకు సొంతం చేసుకుందట. ఇది సినిమాపై ఉన్న అంచనాలకు నిదర్శనం. ఒక ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్‌ టీవీ ప్రసార హక్కులు దాదాపు రు.15 కోట్లకు కొనుగోలు చేసింది. ఆడియో, మ్యూజిక్ హక్కులు లేబుల్ సంస్థ రు. 5 కోట్లకు స్వాధీనం చేసుకుంది. డబ్బింగ్ హక్కులు: హిందీ డబ్బింగ్ హక్కులతో పాటు, ఇతర దేశాల్లోని ప్రసార హక్కుల ద్వారా మిగతా ఆదాయం వచ్చినట్టు తెలుస్తోంది. మిరాయి నాన్-థియేట్రికల్ లెవెల్లోనే దాదాపు సినిమా బడ్జెట్‌ను తిరిగి పొందినట్టే. దీని వల్ల థియేట్రికల్ బిజినెస్‌పై ఒత్తిడి తక్కువగా ఉండనుంది, ఇది మేకర్స్‌కు పెద్ద ఊరట అని చెప్పాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: