ఈ మధ్య కాలంలో ఏదైనా భారీ సినిమా విడుదలకు రెడీ అయింది అంటే ఆ సినిమా వెయ్యి కోట్ల కలెక్షన్లను వసూలు చేస్తుందా అనే సమీకరణాలు జనాల్లో , విశ్లేషకులు బాగా పెరిగిపోయాయి. ఇక భారీ క్రేజ్ ఉన్న సినిమా కనుక విడుదల అయ్యి మంచి టాక్ ను తెచ్చుకున్నట్లైతే అలాంటి సినిమాలు 1000 కోట్ల కలెక్షన్లను కూడా రాబడుతున్నాయి. ఇప్పటివరకు 2025 వ సంవత్సరం చాలా క్రేజీ సినిమాలు ఇండియా వ్యాప్తంగా విడుదల అయ్యాయి. కానీ అందులో ఒక్క సినిమా కూడా 1000 కోట్ల కలెక్షన్లను వసూలు చేయలేదు. ఇప్పటివరకు విడుదల ఆయన ఇండియన్ సినిమాలలో చావా మూవీ 800 ప్లస్ కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ఈ సంవత్సరం అత్యధిక కలెక్షన్లను ఇప్పటివరకు వసూలు చేసిన సినిమాల లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరంలో మిగిలి ఉన్న నెలల్లో ఏకంగా ఐదు భారీ సినిమాలు విడుదల కానున్నాయి. ఆ సినిమాలలో హీరోగా నటించిన వారి అభిమానులు కచ్చితంగా మా హీరో నటించిన సినిమా 1000 కోట్ల కలెక్షన్లను రాబడుతుంది అని గట్టిగా నమ్ముతున్నారు. అలా ఈ సంవత్సరం వెయ్యి కోట్ల కలెక్షన్లను రాబడతాయి అని జనాలు చాలా మంది నమ్ముతున్న ఆ ఐదు సినిమాలు ఏవో తెలుసుకుందాం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా హరిహర వీరమల్లు అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని జూలై 24 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ 1000 కోట్ల కలెక్షన్లను సాధిస్తుంది అని పవన్ అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ నటించిన వార్ 2 , సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా రూపొందిన కూలలీ సినిమా ఈ రెండు కూడా ఆగస్టు 14 వ తేదీన విడుదల కానున్నాయి. ఈ రెండు మూవీలు కూడా 1000 కోట్ల కలెక్షన్లను అందుకుంటాయి అని చాలా మంది భావిస్తున్నారు. ఇక కాంతారా చాప్టర్ 1 మూవీ అక్టోబర్ 2 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా కూడా 1000 కోట్ల కలెక్షన్లను సాధిస్తుంది అని జనాలు నమ్ముతున్నారు. అలాగే ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాజా సాబ్ మూవీ డిసెంబర్ 25 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా కూడా 1000 కోట్ల కలెక్షన్లను సాధించే ఛాన్సెస్ ఉన్నాయి అని చాలా మంది జనాలు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: