టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో హరీష్ శంకర్ ఒకరు. ఈయన రవితేజ హీరోగా రూపొందిన షాక్ మూవీతో దర్శకుడిగాకెరియర్ను మొదలుvపెట్టాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయింది. షాక్ ఫెయిల్యూర్ తర్వాత ఈయన కాస్త గ్యాప్ తీసుకొని రవితేజ హీరోగా మిరపకాయ్ అనే ఫుల్ లెన్త్ కామర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ని రూపొందించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీతో దర్శకుడిగా హరీష్ శంకర్ కి మంచి గుర్తింపు వచ్చింది.

హరీష్ శంకర్ "మిరపకాయ్" మూవీ ని మొదట రవితేజ తో కాకుండా మరో హీరోతో చేయాలి అనుకున్నాడట. కానీ అది కుదరకపోవడంతో రవితేజతో చేశాడట. అలాగే మిరపకాయ్ మూవీ కి వేరే టైటిల్ ని కూడా అనుకున్నాడట. కానీ చివరగా ఆ టైటిల్ మారి హీరో కూడా మారినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... హరీష్ శంకర్ "మిరపకాయ్" కథను తయారు చేసుకున్న సమయంలో దీనికి రొమాంటిక్ రుషి అనే టైటిల్ ను అనుకున్నారట. కథ మొత్తం పూర్తి అయిన ఈ అయ్యాక అందులో పవన్ కళ్యాణ్ ను హీరోగా తీసుకోవాలి అని ఆయన అనుకున్నాడట. కానీ అది కుదరలేదట. దానితో ఆయన రవితేజ హీరోగా రొమాంటిక్ రుషి అనే టైటిల్ తో కాకుండా మిరపకాయ్ అనే టైటిల్ తో ఈ మూవీ ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

మిరపకాయ్ సినిమా తర్వాత హరీష్ శంకర్ , పవన్ కళ్యాణ్ హీరోగా గబ్బర్ సింగ్ అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా విజయంతో హరీష్ శంకర్ కి టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా అదిరిపోయే రేంజ్ సూపర్ సాలిడ్ గుర్తింపు వచ్చింది. ఆఖరుగా రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ సినిమాను రూపొందించిన హరీష్ శంకర్ కి ఈ మూవీ ద్వారా అపజయం దక్కింది. ప్రస్తుతం హరీష్ శంకర్ , పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ ని రూపొందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rt