డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆఖరుగా రామ్ పోతినేని హీరోగా కావ్య దాపర్ హీరోయిన్గా రూపొందిన డబల్ ఇస్మార్ట్ అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల ఆయన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది. ఇక డబుల్ స్మార్ట్ లాంటి భారీ అపజయం తర్వాత ఈయన తమిళ నటుడు అయినటువంటి విజయ్ సేతుపతి హీరోగా సినిమాను సెట్ చేసుకున్నాడు. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్గా కనిపించనుండగా ... టబు ఈ మూవీలో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతుంది.

ఈ సినిమాకు బెగ్గర్ అనే టైటిల్ను అనుకుంటున్నారు అని ఓ వార్త చాలా కాలం పాటు వైరల్ అయింది. కానీ విజయ్ సేతుపతి ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ఇప్పటివరకు పూరి జగన్నాథ్ , నా కాంబోలో రూపొందే సినిమాకు టైటిల్ ఏది అనుకోలేదు. ఏదైనా టైటిల్ అనుకున్నట్లయితే అది కన్ఫర్మ్ అయితే దానిని అధికారికంగా ప్రకటిస్తాం అని ఆయన చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల కోసం పూరి జగన్నాథ్ ఓ డేరింగ్ డెసిషన్ తీసుకోబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 25 వ తేదీన క్రిస్మస్ కానుకదా విడుదల చేయాలి అనే ఆలోచనలో పూరి జగన్నాథ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో అనేక క్రేజీ సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. మొదట ఈ సంవత్సరం డిసెంబర్ 5 వ తేదీన రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా రూపొందిన రాజా సాబ్ మూవీ విడుదల కాబోతోంది.

అలాగే అవతార్ 3 మూవీ డిసెంబర్ 19 వ తేదీన విడుదల కానుంది. ఈ మూవీ పై కూడా తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. అలాగే అఖండ 2 మూవీ ని కూడా డిసెంబర్ నెలలోనే విడుదల చేసే ఆలోచనలకు మేకర్స్ వచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇలా డిసెంబర్ నెలలో అనేక క్రేజీ సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. దానితో పూరి జగన్నాథ్ , విజయ్ సేతుపతి తో చేస్తున్న సినిమాను డిసెంబర్లో విడుదల చేయాలి అని ప్లాన్ చేస్తే అది పెద్ద రిస్క్ అవుతుంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: