
ఈమధ్య ఇస్కాన్ కు సంబంధించిన రెస్టారెంట్ కి ఒక బ్రిటిష్ వ్లాగర్ వెళ్లి అక్కడ ఎంత రచ్చ రంబోలా చేశాడు అన్నది అందరికీ తెలిసిందే. ఇస్కాన్ కు సంబంధించిన రెస్టారెంట్ కి వెళ్లి బ్రిటిష్ వ్లాగర్ అక్కడ నాన్ వెజ్ చేస్తారా అంటే లేదు ఇక్కడ వేజ్ మాత్రమే దొరుకుతుంది అని తెలిసినా కూడా అతడు కీఫ్సీ చికెన్ ఉందా..? అంటూ అడిగారు . అలాంటివి ఇక్కడ దొరకవు అని అక్కడ వర్కర్స్ చాలా వినయంగా చెప్పారు. కానీ అతడు మాత్రం వినలేదు హఠాత్తుగా బ్యాగ్ లో నుంచి చికెన్ తీసి అక్కడ తినడం మొదలుపెట్టాడు .
అక్కడ పనిచేసే వర్కర్స్ ఇక్కడ నాన్ వెజ్ నిషేధమని దయచేసి ఇక్కడ ఇలాంటివి చేయకూడదు అని ఎంతో నచ్చచెప్పిన వినలేదు . అతడు మాత్రం కూసింత ఓవర్గా బిహేవ్ చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది . సదరు వ్లాగర్ పై పలు విమర్శలు కూడా వచ్చాయి . పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు . తాజాగా రేణు దేశాయ్ దీనిపైనే స్పందించింది . "ఈ మధ్యకాలంలో ఇతరులకి ఇతర మతాలను గౌరవించడం ఇతరుల నమ్మకాలను అవమానించడం పెద్ద ఫ్యాషన్ గా అయిపోయింది" అంటూ ఇచ్చి పడేసింది ఇలాంటి మూర్ఖులపై చర్యలు తీసుకోవాలి అంటూ సూచించింది". ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .
అయితే రేణు దేశాయ్ మాట్లాడింది ఆ బ్రిటిష్ బ్లాగర్ గురించి కానీ పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన వీరమల్లు సినిమా పై రేణు దేశాయ్ ఈ విధంగా పరోక్షకంగా కౌంటర్ వేసింది అంటూ రచ్చ రంబోలా చేసేస్తున్నారు సోషల్ మీడియాలో కొందరు పవన్ హేటర్స్. ఇప్పుడు రేణు దేశాయ్ మాట్లాడిన మాటలకు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకు లింక్ పెడుతున్నారు . పరోక్షకంగానే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసింది రేణు దేశాయ్ అంటూ మాట్లాడుతున్నారు . కొందరు రీసెంట్ గానే పవన్ తో హరిహరవీరమల్లు నటి పిక్ తీసుకున్న ఆనందంలో ఎగిరి గంత్తేసింది..ఆ కోపం ఇలా చూపించింది ఏమో అంటూ మాట్లాడుతున్నారు. అసలు నిజం ఏంటంటే ఆమె కేవలం ఆ బ్రిటిష్ వ్లాగర్ గురించి మాత్రమే స్పందించింది . కావాలనే ఎవరో పని పాట లేని వాళ్లు ఇలా రేణుదేశాయ్ - పవన్ కళ్యాణ్ కి మధ్య చిచ్చు పెట్టడానికి ఈ విధంగా చేస్తున్నారు అంటున్నారు పవన్ ఫ్యాన్స్..!!