
టాలీవుడ్‌లో చాలా రోజుల తర్వాత గత వారం బాక్సాఫీస్ వద్ద తిరిగి ఉత్సాహం నెలకొంది. ముఖ్యంగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ప్రీమియర్ షోలకు టికెట్లు దొరకలేదు. ఇది తెలుగు బాక్సాఫీస్‌కు ఎంతగానో బూస్ట్ ఇచ్చిన విషయం. మరోవైపు, యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహా హైదరాబాదులో ఆదివారం రోజు అన్ని థియేటర్లలో హౌస్‌ఫుల్ షోలతో ఆకట్టుకుంది. పిల్లలు, కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమా పట్ల బాగా ఆకర్షితులు అవుతున్నారు. ఇక బాలీవుడ్ నుంచి వచ్చిన సయారా మూవీకి తెలుగు మల్టీప్లెక్స్‌లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా యువత నుంచి ఈ సినిమా టిక్కెట్లు బాగా తెగుతున్నాయి. ప్రేక్షకులు మళ్లీ థియేటర్లవైపు రావడం ప్రారంభించారన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఈ జోష్‌ను కొనసాగించేందుకు ఈ వారమే మరో క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.. అదే కింగ్‌డమ్. యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇప్పటికే టీజర్, ట్రైలర్‌ల ద్వారా హైప్ క్రియేట్ చేసింది. కొత్త జోనర్, విభిన్నమైన సెటప్, వినూత్న కథా స్థాయిలు ఈ సినిమాకు ప్లస్ పాయింట్లుగా నిలుస్తున్నాయి.
నిర్మాత నాగవంశీ కూడా ఈ సినిమాపై భారీ నమ్మకంతో ఉన్నారు. విజయ్ కెరీర్‌లో అర్జున్ రెడ్డి, గీత గోవిందం తరహాలో మరో మేజర్ హిట్ అవుతుందనే అంచనాలు పెరుగుతున్నాయి. బుధవారం నుంచే ప్రీమియర్ షోలు మొదలయ్యే అవకాశముంది. ఈ సినిమాతో పాటు డబ్బింగ్ సినిమా సార్ మేడమ్ కూడా రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ ఫ్యామిలీ డ్రామాలో విజయ్ సేతుపతి, నిత్యామీనన్ జంటగా నటించారు. ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండటంతో కుటుంబ ప్రేక్షకుల్ని ఈ సినిమా ఆకర్షించే అవకాశాలు ఉన్నాయి. దర్శకుడు పాండిరాజ్ ఎమోషనల్ కథనాల్ని హార్ట్ టచింగ్‌గా చూపిస్తాడన్న పేరుంది. ఇక కింగ్‌డమ్ సినిమాకు ఆగస్టు 14 వరకూ పెద్దగా పోటీ లేదు. మధ్యలో రెండు వారాల గ్యాప్‌ను సద్వినియోగం చేసుకుంటే విజయ్ దేవరకొండ ఈ సినిమాతో భారీ వసూళ్లు రాబట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు