తాజాగా విడుదలైన కింగ్డమ్ మూవీ విజయ్ దేవరకొండ అభిమానుల ఆకలి తీర్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా రోజుల నుండి హిట్ కోసం వేచి చూస్తున్న విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ మంచి హిట్ ఇచ్చిందనే టాక్ సినిమా చూసిన ప్రేక్షకుల నుండి వినిపిస్తోంది.ఈ సినిమా చూసిన చాలామంది నెటిజెన్లు మిక్స్డ్ రివ్యూ ఇస్తున్నారు.ఇక మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ మాత్రం సినిమా బాగుందని అంటున్నారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాకని నాగ వంశీ నిర్మించారు. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా విడుదలైన సినిమా చూసి విజయ్ దేవరకొండ అభిమానులు మేము మోసపోయాం అంటూ తెగ నిరాశపడుతున్నారు.

 మరి ఇంతకీ సినిమా బాగుంది అంటూ రివ్యూ ఇవ్వవలసిన విజయ్ దేవరకొండ అభిమానులే ఎందుకు మేము మోసపోయాం అంటూ మాట్లాడుతున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. తాజాగా విడుదలైన కింగ్డమ్ మూవీ కోసం చాలామంది విజయ్ దేవరకొండ అభిమానులు థియేటర్లకు వెళ్లి సినిమా చూసి ఎంజాయ్ చేశారు.కానీ ఒక్క విషయంలో మాత్రం ఫ్యాన్స్ ఘోరంగా హర్ట్ అయ్యారు. అదేంటంటే..ఈ సినిమాలో "హృదయం లోపల" అనే సాంగ్ ని తొలగించారు.. సినిమా విడుదలకు ముందే హృదయం లోపల అనే మెలోడీ సాంగ్ కి ఎంతో మంచి రెస్పాన్స్ రావడమే కాదు చాలామందికి ఫేవరెట్ సాంగ్ కూడా మారిపోయింది.అయితే అలాంటి అద్భుతమైన టాక్ తెచ్చుకున్న ఈ మెలోడీ సాంగ్ సినిమా నుండి ఎందుకు తీసేసారు అంటూ సినిమా చూసిన విజయ్ దేవరకొండ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు.

అంత మంచి సాంగ్ తీసేయడం మాకు చాలా నిరాశ కల్పిస్తోంది అని మోసపోయాం అంటూ పోస్టులు చేస్తున్నారు. మరి విజయ్ దేవరకొండ అభిమానుల కోరిక మేరకు సినిమాలో ఈ పాటను మళ్ళీ యాడ్ చేసి అప్డేట్ వెర్షన్ ని రిలీజ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. కింగ్డం మూవీకి మిక్స్డ్ రివ్యూలు వస్తున్నాయి. ఈ సినిమా ఫస్టాఫ్ చాలా అద్భుతంగా ఉంది అని కానీ సెకండ్ హాఫ్ స్లో నరేషన్ తో సాగుతూ కాస్త బోర్ కొట్టింది అంటున్నారు.ఇక సెకండ్ పార్ట్ ఉండడంతో క్లైమాక్స్ ని అసంపూర్తిగా ముగించేశారు అని ఫీలింగ్ అభిమానుల్లో కలుగుతుంది.అయితే ఈ సినిమాలో కేవలం రెండు పాటలు మాత్రమే ఉన్నాయని అభిమానులు నిరాశ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: