ఆగస్టు 14న ఇండియ‌న్‌ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ మెగా క్లాష్ . ఒకవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీ వార్-2, మరోవైపు సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కూలీ – రెండూ ఒకే రోజు థియేటర్లలో అడుగుపెట్టబోతున్నాయి. దీంతో ఈ రెండు సినిమాల‌ మధ్య మాస్ ఆడియన్స్ ఎటుపోతారన్నది టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అంతా ఆసక్తిగా చూస్తోంది. ఇప్పటికే హైప్ విషయంలో చూసుకుంటే ‘కూలీ’ కొంత వరకూ ‘వార్-2’ను దాటి ముందుంది. రజినీతో పాటు అక్కినేని నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర, అమీర్ ఖాన్ లాంటి భారీ క్యాస్టింగ్, లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వంటి ఎలిమెంట్లు సినిమాకు బలంగా నిలిచాయి.


ఇక  ఇప్పటికే విడుదలైన పాటలకు భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే, సినిమా ట్రైలర్ విషయంలో మాత్రం ట్రెండ్ కాస్తా ఊహించిన దానికంటే భిన్నంగా సాగుతోంది. ‘కూలీ’ ట్రైలర్‌లో లోకేష్ టేకింగ్, స్టైలిష్ విజువల్స్, హీరోల ప్రెజెన్స్ బాగా ఎలివేట్ చేసినా… కథాపరంగా ఏమీ చెప్పకపోవడం, ఎమోషనల్ పుల్స్ లేకపోవడం కొంతమందిలో అసంతృప్తిని కలిగించింది. ఇది యూనానిమస్ పాజిటివ్ ట్రైలర్ కాదని స్పష్టమవుతోంది. మాస్ ప్రేక్షకులు ఊహించిన పవర్ ప్యాక్డ్ డైలాగ్స్ లేకపోవడం కూడా కొంత నెగటివ్ టాక్‌కు దారితీస్తోంది. కానీ ట్రైలర్లో కనిపించిన కొన్ని విజువల్స్, టైమ్ ట్రావెల్ లాంటి ఎలిమెంట్స్ చూస్తుంటే… లోకేష్ ఈసారి డిఫరెంట్ ప్రయోగం చేస్తున్నాడన్న అభిప్రాయం బయటపడుతోంది.


“సినిమాలోనే అసలు మ్యాజిక్ ఉంటుందనుకుంటున్నాం” అని కొందరు నమ్మకంగా ఉన్నారు. కానీ రజినీ వంటి మాస్ ఐకాన్‌తో ఈ విధమైన ప్రయోగాలు ఎంతవరకు వర్క్ అవుతాయనేది డిబేట్ అయ్యే అంశం.ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ ‘వార్-2’ ట్రైలర్ అయితే తక్కువ హైప్‌తో వచ్చినా, కనీసం ఒక యూనిఫార్మ్ యాక్షన్ ఎలివేషన్ అందించగలిగింది. ఇప్పటివరకు గమనిస్తే – 'వార్-2' ట్రైలర్‌ కన్నా 'కూలీ' ట్రైలర్‌పై చర్చ ఎక్కువ, కానీ అటువంటి చర్చలు హైప్ పెంచలేకపోవడం గమనార్హం. బాక్సాఫీస్ వద్ద విజేత ఎవరో తెలుసుకోవాలంటే ఇంకో పది రోజులు వేచి చూడాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: