- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ ని సెట్ చేస్తూ.. ఇండియ‌న్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోన్న సినిమా ఏదైనా ఉందంటే అది యానిమేష‌న్ సినిమా మ‌హావ‌తార్ న‌ర‌సింహా. ఈ సినిమా రిలీజ్ కు ముందు ఎలాంటి అంచ‌నాలు లేవు. కానీ రిలీజ్ అయ్యాక రోజు రోజుకు వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తూ ఇటు సౌత్ తో పాటు అటు నార్త్ ఇండియ‌న్ బాక్సాఫీస్ ను సైతం షేక్ చేస్తూ దూసుకు పోతోంది. మ‌రో ఇంట్ర‌స్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమా కన్నడ కంటే తెలుగు, హిందీలోనే ఈ సినిమా భారీ వసూళ్లు అందుకొని క్రేజీ రెస్పాన్స్ చూపిస్తుంది. హిందీలో మాత్రం జనం ఈ సినిమాను మరో లెవెల్లో చూస్తున్నారని సోష‌ల్ మీడియా లో వైర‌ల్ అవుతోన్న పోస్టులు , పిక్ లు చెపుతున్నాయి.


అక్కడ చాలా థియేటర్స్ లో ఈ సినిమా షోకి వెళ్లే ముందు థియేటర్ దగ్గరే చెప్పులు విడిచి లోపలికి వెళుతున్నారు. చెప్పులు లేకుండా సినిమా చూస్తూ భక్తి భావం లోకి వెళ్లిపోతున్నారు. భ‌క్తి పార‌వ‌శ్యంలో మునిగి తేలుతూ సినిమా చూస్తున్నారు. దీంతో ఈ డివోషనల్ సినిమా పట్ల వారు చూపిస్తున్న భక్తి, గౌరవం ఎలా ఉన్నాయో మ‌న‌కు తెలుస్తోంది. ఆల్రెడీ నిన్న శ‌నివార‌మే రు. 10 కోట్ల‌కు పైగా నెట్ వ‌సూళ్లు ఈ సినిమాకు వ‌చ్చాయంటే సినిమా కేవలం హిందీ వెర్ష‌న్ లోనే ఏకంగా రు. 50 కోట్ల‌కు పైగా నెట్ వ‌సూళ్లు అందుకుంది. ఓవ‌రాల్ గా వ‌చ్చిన రు. 79 కోట్ల గ్రాస్ లో ఎక్కువ హిందీ వెర్ష‌న్ నుంచే రావ‌డం విశేషం.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: