
హృతిక్ రోషన్ “కబీర్”గా, ఎన్టీఆర్ “ విక్రమ్” పాత్రలో సందడి చేయనున్నారు. తారక్ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్! .. ఎన్టీఆర్‌కు ఇది బాలీవుడ్‌లో ఫస్ట్ ఫుల్ లెంగ్త్ రోల్, అందులోనూ హృతిక్ లాంటి స్టార్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేయడం అంటే... ఊహించేసుకోవచ్చు. నార్త్ ఇండియా ప్రెస్, మీడియా తారక్‌ను స్టార్ మటీరియల్‌గానే చూస్తోంది. ప్రస్తుతం తారక్ ముంబైలో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తెలుగు వర్షన్ స్పెషల్: AI టచ్! వార్ -2 తెలుగు ప్రేక్షకులను కూడా దృష్టిలో ఉంచుకుని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా హృతిక్ రోషన్ పాత్రకు తెలుగులో లిప్ సింక్ కరెక్ట్ గా రావడానికి మేకర్స్ AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఉపయోగించారట! డైలాగ్స్ ఖచ్చితంగా సరిపోవాలన్న ఉద్దేశంతో పలువురు తెలుగు రచయితలను కూడ బోర్డ్ లోకి తీసుకున్నారు.
ఈ ప్రయత్నంతో తెలుగు వెర్షన్ కూడా అద్భుతంగా రానుందని అంచనాలు ఉన్నాయి. స్టార్ కాస్టింగ్ – టెక్నికల్ టీమ్ .. కియారా అద్వానీ హీరోయిన్‌గా మెరుస్తుండగా, అనిల్ కపూర్, అశుతోష్ రాణా, దిషితా సెహగల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మ్యూజిక్ డ్యూయో సంచిత్ – అంకిత్ బల్హారా ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు మ్యూజిక్ అందిస్తున్నారు. మొత్తానికి... వార్ -2 కేవలం సినిమా కాదు – ఇది రెండు ఇండస్ట్రీల ప్యాన్ ఇండియా ప్రెస్టేజ్ ప్రాజెక్ట్. భారీ బడ్జెట్, స్టార్ పవర్, టెక్నాలజీ, AI డబ్బింగ్, ఇంటెన్స్ ప్రొమోషన్స్ అన్నీ కలిసి ఈ సినిమాని మరో లెవెల్‌కి తీసుకెళ్తున్నాయి. చూడాలి మరి... వార్ -2 బాక్సాఫీస్‌ను ఎలా బాంబ్ చేస్తుందో!